- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OLA: ఓలాకు సినిమా కష్టాలు.. ఈవీలు సీజ్..అంతేకాదు 107షోరుమ్‌లపై..!
OLA: ఓలాకు సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: OLA: ఓలాకు సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో కంపెనీకి చెందిన కొన్ని షోరూమ్స్ మూతపడ్డాయి. వీటితోపాటు 200కు పైగా ఈవీలను సీజ్ చేశారు. దీని వెనక కారణం ఏంటో తెలుసుకుందాం.
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు క్రేజ్ పెరగడంతో ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు వేగంగా దూసుకెళ్తున్నాయి. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్య ఓలా ఎలక్ట్రిక్ కు పెద్ద దెబ్బ తగిలింది. లైసెన్స్ లేకుండా రన్ చేస్తున్న ఓలా షోరూమ్ ను మహారాష్ట్ర రవాణాశాఖ స్వాధీనం సీజ్ చేసింది. 1.07 షోరూమ్స్ నిబంధనలను విరుద్ధంగా ఉన్నట్లు రిపోర్టులు వెల్లడించాయి. ఈ మేరకు నోటీసులను పంపించారు. ఇందులో చాలా వరకు మూసివేశారు. 214 ఎలక్ట్రిక్ స్కూటర్లను సీజ్ చేశారు. భారత్ లో టెస్ట్ డ్రైవ్ కోసం ఏదైనా వాహనాన్ని విక్రయించేందుకు లేదా చూపించేందుకు తప్పనిసరి అయిన అవసరమైన ట్రేడ్ సర్టిఫికేట్ ఈ డీలర్ షిప్స్ లో లేనందున ఈ చర్య తీసుకున్నారు.
ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ప్రభుత్వం ఇచ్చే అనుమతి. ఇది ఏదైనా షోరూమ్ వాహనాలను విక్రయించడానికి పరీక్షించడానికి అనుమతి ఇస్తుంది. అది లేకుండా వెహికల్ అమ్మడం లేదా చూపించడం చట్టరీత్యా నేరం అవుతుంది. ఇటువంటి డీలర్ షిప్స్ లాగిన్ ఐడీలను 24గంటల్లోగా మూసేయాలని మహారాష్ట్ర జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆర్టీవో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన షోరూమ్స్ స్థితిని అప్ డేట్ చేయాలి.
ఓలా ఈవీ దేశవ్యాప్తంగా తన ఈవీ నెట్ వర్క్ ను విస్తరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ చర్య జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలకు మహారాష్ట్ర ఒక ముఖ్యమైన మార్కెట్.ఈ ఘటనలు కంపెనీ అమ్మకాలు, బ్రాండ్ ఇమేజ్ రెండింటినీ ప్రభావితం చేయనున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఈ కంపెనీకి ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీస్ పంపించి వారి నుంచి స్పందన కోరింది. చట్టపరమైన నిబంధనలను పాటించడం ప్రతి బ్రాండ్ బాధ్యత అంటున్నారు.






