బాధ్యతను గుర్తుచేస్తున్న 80ఏళ్ల బామ్మ..!

by  |
బాధ్యతను గుర్తుచేస్తున్న 80ఏళ్ల బామ్మ..!
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్‌లో 80 ఏళ్ల బామ్మ తన బాధ్యతను చాటుకుంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడమే కాకుండా, అందరికీ తమ బాధ్యతను గుర్తుచేస్తోంది. ఓటు హక్కు విలువను నేటి యువతరానికి, విద్యావంతులకు చెప్పకనే చెబుతోంది. ఈ విషయాన్ని ఆమె మనువరాలు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.లాక్‌డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మా అమ్మమ్మ బయటకు రాలేదని, తొలిసారి ఓటు వేసేందుకు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిందని పద్మశ్రీ అనే మహిళ బామ్మ ఫొటోను పోస్టు చేశారు.

ఈ పోస్టును తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ పార్టీ విభాగం వారు లైక్ చేశారు. అంతేకాకుండా, ఈ వయస్సులో కూడా బామ్మ ఓటు వేసి సమాజం పట్ల తన బాధ్యతను చాటుకున్నారని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలాఉండగా, ఉదయం పోలింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి గ్రేటర్ ప్రజలు ఓటు వేసేందుకు బయటకు రాలేదు. ఫలితంగా మధ్యాహ్నం 3గంటల వరకు కేవలం 25.34శాతం పోలింగ్ నమోదైంది. విద్యావంతులు అధికంగా ఉండే హైదరాబాద్ లో మొదటిసారి ఇలాంటి పోలింగ్ శాతం నమోదవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెల్లుతున్నాయి. చదువుకున్న వారే తమ బాధ్యతను విస్మరిస్తే మిగతా వారి పరిస్థితి ఎంటనీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురుస్తోంది. అటు తక్కువగా పోలింగ్ శాతం నమోదవడం పట్ల అభ్యర్థుల్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది.


Next Story

Most Viewed