పిగ్గీ బ్యాంకు డబ్బుల్ని విరాళంగా ఇచ్చిన 8 ఏళ్ల చిన్నోడు

by  |
పిగ్గీ బ్యాంకు డబ్బుల్ని విరాళంగా ఇచ్చిన 8 ఏళ్ల చిన్నోడు
X

దిశ వెబ్ డెస్క్ :
ఓ వైపు వైద్య సిబ్బంది, శాస్ర్తవేత్తలు .. కరోన వైరస్ పై యుద్ధం చేస్తుంటే.. మరోవైపు మానవతా హృదయులు అన్నార్తులకు ఆపన్నహస్తం అందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది చిన్నారులు విరాళాలు సేకరిస్తూ, తమ దాచుకున్న డబ్బులను ప్రభుత్వానికి అందిస్తూ.. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా జమ్మూ కశ్మీర్ కు చెందిన ఎనిమిదేళ్ల మాలిక్ ఉబీద్ తన పిగ్గీ బ్యాంకును విరాళంగా ఇచ్చి అందరి అభినందనలు అందుకుంటున్నాడు.

జమ్ము కశ్మీర్ లోని బండిపొర జిల్లాకు చెందిన ఎనిమిదేళ్ల మాలిక్ ఉబీద్ తన స్విగ్గీ బ్యాంకుతో… డిస్ట్రిక్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆఫీసుకు వచ్చి వాటిని విరాళంగా ఇచ్చాడు. కోవిడ్ 19 పై పోరాడుతున్న వారికి ఈ డబ్బును ఉపయోగించమని తెలిపాడు. పోలీస్ కమిషనర్ ఉబీద్ సేవాభావానికి హర్షం వ్యక్తం చేయడంతో పాటు, ఆ పిల్లోడిని అభినందించాడు. ఉబీద్ ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. కోవిడ్ 19 వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఎంతోమంది చిన్నారులు తాము దాచుకున్న డబ్బులను విరాళంగా అందిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మిజోరాంకు చెందిన ఏడేళ్ల బాలుడు, గుజరాత్ కు చెందిన పలువురు చిన్నారులు ప్రభుత్వాలకు పిగ్గీ బ్యాంకులు అందించడం మనందరికీ తెలిసిన విషయమే.

జమ్ము కశ్మీర్ లో ఇప్పటివరకు 200 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.


Tags: coronavirus, charity , help, piggy bank, 8 year boy, kashmir

Next Story

Most Viewed