72రోజుల తర్వాత.. దేశంలో కరోనా కేసులు ఎన్నంటే..?

by  |
carona 1
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. 72 రోజుల తర్వాత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కానీ మరణాలు మాత్రం ఆందోళన కలిగించేలా ఉన్నాయి. సోమవారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 70,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,10,410కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 3,921 మంది మరణించారు. అదే సమయంలో 1,19,501 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,74,305కు పెరిగింది. ప్రదేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 25,48,49,301 మందికి వ్యాక్సిన్‌ను అందించారు. ఇ ప్రస్తుతం దేశంలో 9,73,158 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో కొంత మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.

Next Story

Most Viewed