13 సెకన్లలో 100 పంచ్‌‌లు.. 5 ఏళ్ల బుడ్డోడి వరల్డ్ రికార్డ్!

by  |
punch boy
X

దిశ, ఫీచర్స్ : అతి తక్కువ సమయంలో 100 పంచ్‌లు కొట్టిన రికార్డ్ ఎవరిదో తెలుసా అనగానే.. మంది ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్, మానీ పాక్వియావో, ఆస్కార్ డి లా హోయా, రిచర్డ్ గార్సియా లేదా మైక్ టైసన్ వంటి మహామహా బాక్సింగ్ వీరులు పేర్లు చెబుతారు. కానీ ఓ ఐదేళ్ల బుడ్డోడు వేగంగా వంద బాక్సింగ్ పంచ్‌లు కొట్టి, ప్రపంచ రికార్డ్ నమోదు చేశాడు.

ఢిల్లీకి చెందిన ఐదేళ్ల అరిందమ్ గౌర్ ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్నాడు. బాక్సింగ్‌ను ఇష్టపడే తన కుమారుడు అరిందమ్‌కు ఐదో పుట్టినరోజు కానుకగా ఆ చిన్నోడి తండ్రి అరుణ్ బాక్సింగ్ పంచ్ బ్యాగ్ బహుమతిగా ఇచ్చాడు. అరిందమ్ బాక్సింగ్ గురించి ఎక్కడ తెలుసుకున్నాడో ఏమో కానీ, తండ్రి తెచ్చిన పంచింగ్ బ్యాగ్‌పై ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే బాక్సింగ్‌లో చిన్నవయసులోనే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఓ పిల్లోడి ఆర్టికల్‌ను న్యూస్ పేపర్‌లో చదివినా అరిందమ్ కూడా రికార్డ్ బ్రేక్ చేస్తానని తన తండ్రితో చెప్పాడు. ఆ తర్వాత అరిందమ్ సీరియస్‌గా సాధన చేయడం చూసిన తండ్రి అతడికి ఇంట్లోనే బాక్సింగ్ కోచింగ్ ఇప్పించాడు. ఆ నిరంతర ప్రాక్టీస్‌తో పాటు, తండ్రికిచ్చిన మాట ప్రకారం ఆ బుడ్డోడు నిజంగానే 13సెకన్లలో ఫాస్టెస్ట్ 100 బాక్సింగ్ పంచ్‌లు కురిపించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.

‘బాక్సింగ్‌ను చాలా ప్రేమిస్తున్నాను. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 3 గంటల పాటు సాధన చేస్తాను. పెద్ద బాక్సర్‌గా మారాలనుకుంటున్నాను. భారత్ తరపున భవిష్యత్‌లో బాక్సింగ్ క్రీడలో ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు వెళతాను. విజేందర్ సింగ్, మేరీకో‌మ్‌లంటే చాలా ఇష్టం. ఒలంపిక్స్‌లో మేరీ మేడమ్ బంగారు పతకం గెలవాలని ఆశిస్తున్నాను. ఆమెకు శుభాకంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ అరిందమ్ తెలిపాడు.


Next Story

Most Viewed