ఈ-కామర్స్ ద్వారా సర్వీస్ అందించే ఆటో రిక్షా సేవలకు 5 శాతం జీఎస్టీ!

by  |
auto
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సర్వీస్ అందించే ఆటో-రిక్షా సేవలపై వచ్చే ఏడాది నుంచి 5 శాతం జీఎస్టీ విధించబడనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రెవెన్యూ విభాగం నవంబర్ 18 నాటి నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు ఈ-కామర్స్ ద్వారా రవాణా సేవలందించే ఆటో రిక్షాలకు జీఎస్టీ మినహాయింపును ఉపసంహరించుకుంది. సాధారణ ఆటో రిక్షా సేవలను ఎలాంటి జీఎస్టీ ఉండదని, ఏదైనా ఈ-కామర్స్ ద్వారా అందించే వారికి మాత్రమే 2022, జనవరి 1 నుంచి 5 శాతం పన్ను అమలు కానుంది.

ఈ-కామర్స్ పరిశ్రమ ప్రస్తుతం మార్కెట్లో కీలకంగా ఉంది. చాలావరకు కంపెనీలు ప్రయాణీకులకు చేరువ అయ్యేందుకు ఆన్‌లైన్ ద్వారా తక్కువ, అనుకూలమైన బుకింగ్ రైడ్‌లను ఇవ్వడం వల్ల పరిశ్రమలో ప్రభావం కనిపిస్తోంది. తాజాగా సవరించిన మార్పు వల్ల మెరుగైన పరిస్థితులు ఏర్పడనున్నాయి.


Next Story

Most Viewed