ట్రాక్టర్ చార్జీల కోసం 40 కుటుంబాల బహిష్కరణ.. ఎక్కడంటే!

by  |
balkondaa
X

దిశ, బాల్కొండ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండలో దారుణం జరిగింది. ట్రాక్టర్ చార్జీలు పెంచాలని కోరినందుకు గ్రామ కమిటీ సభ్యులు 40 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ విధించారు. దీంతో ఆవేదన చెందిన కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. వివరాల్లోకివెళితే.. బాల్కొండ మండల పరిధిలోని ట్రాక్టర్లు కలిగిన 40 కుటుంబాలు డీజిల్‌‌ ధరలు పెరిగిన నేపథ్యంలో ట్రాక్టర్‌‌ కిరాయి ధరలు పెంచాలని గ్రామ కమిటీ సభ్యులను కోరారు.

ఇంతకు ముందు రాసుకున్న ఒప్పంద పత్రం ప్రకారం ట్రాక్టర్ కిరాయి ధరలు పెంచేది లేదని వారు తెగేసి చెప్పారు. అయితే, పాత చార్జీల ప్రకారం మేము పనిలోకి వచ్చేది లేదని ట్రాక్టర్‌‌ యజమానులు చెప్పడంతో ఆగ్రహించిన గ్రామ కమిటీ సభ్యులు 40 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. గ్రామస్తులు పొలం పనులకు వీరిని పిలవొద్దని తీర్మాణం చేశారు. చేసేదేమి లేక బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Next Story