గాల్లో ప్రాణాలు.. ఆగని కరోనా.. వదలని తుఫాన్

by  |
గాల్లో ప్రాణాలు.. ఆగని కరోనా.. వదలని తుఫాన్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తుండగా, మరోవైపు తౌక్తే తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. దీని దెబ్బకు తీర ప్రాంతాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. నిన్న గుజరాత్ తీరాన్ని తుఫాన్ తాకగా, వందల సంఖ్యలో చెట్లు నెలవాలగా, భారీ వర్షం దాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది నిరాశ్రయులయ్యారు. తుఫాన్ ఎఫెక్ట్ క్రమంగా గోవా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక మీదుగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండనుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

అయితే, ఇది తాత్కాలికంగా మాత్రమే ఉంటుందని స్పష్టంచేసింది. మరోవైపు మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో తుఫాన్ ప్రభావం వలన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో గుజరాత్‌లో 2లక్షల మందిని అక్కడి ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఆ సమయంలో జరిగిన బీభత్సానికి మొత్తం 14 మంది మృతి చెందగా, మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో ఆరుగురు మృతి చెందారు. ఇక కర్ణాటకలో 8మంది మృత్యువాత పడ్డారు. ఇదిలాఉండగా, తుఫాన్ ఎఫెక్ట్‌పై గుజరాత్, మహారాష్ట్ర, గోవా సీఎంలతో పీఎం మోడీ ఫోన్‌లో సంభాషించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Next Story

Most Viewed