సింగరేణి కార్మికులకు దసరా బోనస్

by  |
Singareni workers
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా పండుగ కానుకను ప్రకటించారు. సింగరేణి ఆర్జిస్తున్న లాభాల్లో కార్మి కులకు 28% వాటా ఇస్తున్నట్లు ప్రకటించారు. లాభాల్లో వాటా పెంచడంతో ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 బోనస్‌గా అందనున్నట్లు అధికారులు వెల్లడించారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 48వేల మందికి పైగా కార్మికులు ఈ బోనస్‌ అందుకోనున్నారు. ఏటా సింగరేణి కార్మికులకు దసరా కానుకగా బోనస్ అందించడం ఆనవాయితీగా వస్తోంది. 2013-14 సంవత్సరంలో కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.13,540 చొప్పున మాత్రమే సంస్థ బోనస్ చెల్లించింది .. 2018-19లో 1763.66 కోట్లు లాభాల్లో వాటాను 28శాతానికి పెంచారు. లాభాల్లో వాటా పెంచడం వల్ల ప్రతీ కార్మికుడికి రూ. 1,00, 899లు బోనస్ అందింది. 2019-20లోనూ సింగరేణి కాలరీస్ సంస్థ అదనంగా లాభాలను అర్జించినందున 28శాతం బోనస్‌ను ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

Next Story

Most Viewed