నిజామాబాద్ లో 27 పాజిటివ్ కేసులు

310

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా కేసుల సంఖ్య తగ్గిపోయాయి అనుకునేలోపే కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం మొదలైంది. తాజగా నిజామాబాద్ జిల్లాలో బుదవారం 27 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని జిల్లా వైధ్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుధర్శనం తెలిపారు.

703 మందికి ఆర్టిపిసిఆర్, ఆర్ఎటి పరిక్షలను నిర్వహిస్తే 676 మందికి నేగిటివ్ రాగా 27 మందికి పాజీటివ్ రిపోర్టులు వచ్చాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 1,66,751 మందికి ఆర్ టిపిసిఆర్, ర్యాపిడ్ యాంటి జేన్ పరిక్షలను నిర్వహిస్తే 1,45,507 మందికి నెగిటివ్ వచ్చాయని 15,949 మందికి పాజీటివ్ గా తెలింది. కరోనా వైరస్ కు టికాల పంపిణి జరుగుతుండగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..