మైదానం పరిసరాల్లో హై అలర్ట్.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు బెందిరింపులు

by Disha Web Desk 2 |
మైదానం పరిసరాల్లో హై అలర్ట్.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు బెందిరింపులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేపు అహ్మదాబాద్ వేదికగా ఇండియా వర్సె్స్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్‌కు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఖలీస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిలిపివేయాలని హెచ్చరించాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసిన పన్నూ.. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ అల్లర్ల గురించి పేర్కొంటూ మతపరంగా ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు.


ఇజ్రాయెల్-హామాస్ యుద్ధం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గుణపాఠం నేర్చుకోవాలని లేదంటే ఇండియాలో కూడా ఇటువంటి యుద్ధం మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో వరల్డ్ కప్‌లో బాంబ్ బ్లాస్టులు జరుగుతాయని అగంతకుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తుండటం కలకలం రేపుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌ను చూసేందుకు భారత ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ హాజరుకాబోతున్న నేపథ్యంలో భద్రతను కట్టిదిట్టం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు రేపటి మ్యాచ్ కోసం 4,500 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ స్టేడియం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.



Next Story

Most Viewed