భారత మార్కెట్లోకి కొత్త SUV మోడల్‌ను లాంచ్ చేసిన రేంజ్‌రోవర్!

by  |
Range Rover Evoque
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ఇండియా తన సరికొత్త రేంజ్‌రోవర్ ఎవోక్ మోడల్ కారును భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 64.12 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. కొత్త ఎవోక్ రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఆర్‌డైనమిక్ ఎస్ఈ వేరియంట్ పెట్రోల్ వెర్షన్‌తో పాటు డీజి్‌లో కూడా లభిస్తుంది. డీజిల్ వెర్షన్ ఎస్-ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎవోక్ ఎస్-ట్రిమ్, ఎవోక్ ఆర్-డైనమిక్ ఎస్ఈ రెండూ 2.0 లీటర్ ఇంజెనియమ్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్లతో రానున్నాయి.

‘ఎవోక్ మోడల్ పూర్తి అధునాతన, విభిన్నమైన డిజైన్‌తో మార్కెట్లోకి వస్తోంది. అన్ని రకాలుగా కొత్త ఇంటీరియర్ కర్లాతో పాటు కొత్త టెక్నాలజీ, ఇంజేనియమ్ శక్తి కలిగిన ఇంజిన్ ఇందులో అమర్చినట్టు’ జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ఎండీ రోహిత్ సూరి వివరించారు. రేంజ్‌రోవర్ ఎవో ఎస్-డీజిల్ వెర్షన్ 8.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, 213 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని కలిగి ఉందని కంపెనీ తెలిపింది. అలాగే, రేంజ్‌రోవర్ ఎవోక్ ఆర్-డైనమిక్ ఎస్ఈ పెట్రోల్ వాహనం కేవలం 7.60 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, దీని గరిష్ఠ వేగం 221 కిలోమిటర్లని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Next Story

Most Viewed