పాక్ బాలా‌కోట్ పై భారత్ ఎయిర్ స్ట్రైక్ : ఆ కోతి ఖతమై నేటికి రెండేళ్లు

by  |
పాక్ బాలా‌కోట్ పై భారత్ ఎయిర్ స్ట్రైక్ : ఆ కోతి ఖతమై నేటికి రెండేళ్లు
X

దిశ,వెబ్‌డెస్క్: బాలా‌కోట్ వైమానిక దాడి జరిగి నేటితో రెండేళ్లు ముగిసింది. ఫిబ్రవరి 26, 2019 తెల్లవారుజామున 3.30 గంటలకు భారత్ కు చెందిన వైమానికదళం పాకిస్తాన్ బాలా కోట్ ప్రాంతంలోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది. 1971 భారత్-పాక్ తరువాత తొలిసారి భారత్ వైమానిక దళం పాకిస్తాన్ లో చొరబడి ఉగ్రవాదుల భరతం పట్టడం ప్రపంచ వ్యాప్తంగా భారత్ సైన్యం ప్రతిభాపాటవాలు మారుమ్రోగాయి. అయితే భారత్ .., పాక్ పై దాడి చేయాడనికి ప్రధాన కారణం భారత్ లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి. ఉగ్రమూకుల జరిపిన దాడిలో మనదేశానికి చెందిన సుమారు 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు.

దీంతో కేంద్రం దేశం కోసం ఎలాంటి భయంకరమైన చర్యలకు ప్రతీకారం తీర్చుకోగలదని బాలా కోట్ వైమానిక దాడితో నిరూపించింది. బాలా కోట్ వైమానిక దాడిలో 12 మిరాజ్ యుద్ధవిమానాల్లో సుమారు 2వేలమంది సైన్యం భారత్ – పాక్ నియంత్రణ రేఖను (ఎల్ఓసి) దాటి పాకిస్తాన్ లోని బాలా కోట్ కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ (జెఈఎమ్) ఉగ్రవాదుల్ని హతమార్చింది.

అయితే ఫిబ్రవరి 27 న బాలా కోట్ వైమానిక దాడితో పాకిస్తాన్ వైమానిక దళం (పిఎఎఫ్) స్పందించింది. భారత్ తన దాడుల్ని నిలిపివేయాలని కోరింది. మరోవైపు బాలా కోట్ పై దాడులు జరిగే సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ మిగ్-21 లో సాంకేతిక లోపం రావడంతో పారాచ్యూట్ సాయంతో పాక్ లో ల్యాండయ్యారు. అది గమనించిన పాక్ ఆర్మీ అతన్ని బంధించింది. ఆ తర్వాత అతని విడుదల కోసం భారత్ పాక్ పై ఒత్తిడి పెంచడంతో.. వియన్నా ఒప్పందం ప్రకారం.. వింగ్‌ కమాండర్‌ను ఇండియాకు అప్పగించింది పాకిస్తాన్. శత్రు దేశంలో ఉన్నా కూడా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ భారత ప్రభుత్వం అభినందన్ కు వీర్ చక్ర పురస్కారంతో సత్కరించింది.

బాలకోట్ వైమానిక దాడి: ఇది భారత్ విజయం

బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్ మిషన్ పేరు ‘ఆపరేషన్ బందర్’. దీనిని భారత వైమానిక దళానికి చెందిన 7,9 స్క్వాడన్ గ్రూప్ చెందిన జవాన్లు నిర్వహించారు. ఇండియన్ మిరాజ్ విమానాల ద్వారా 2000 సైన్యం నియంత్రణ రేఖను దాటి శత్రువులను హతమార్చి, భారతదేశం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదని ఒక సందేశాన్ని ఇవ్వడం ఈ రోజుతో సరిగ్గా సంవత్సరం అయ్యింది.బాలా కోట్ వైమానిక దాడితో భారత్ పుల్వామా దాడి అమరవీరులకు నివాళి అర్పిస్తే పాకిస్తాన్‌ ఏం చేయలేక తన నిస్సహాయతను బయటపెట్టిందని గత సంవత్సరం బాలా కోట్ వైమానిక దాడి జరిగి సంవత్సరం పూర్తైన సందర్భంగా ఐఏఎఫ్ మాజీ చీఫ్, ఎయిర్ మార్షల్ బిఎస్ ధనోవా ఇంటర్వ్యూలో తెలిపారు. ప్లాన్ ప్రకారం పాక్ ఇంటెలిజెన్స్ ను గందరగోళపరిచేందుకు అల్ట్రా-సేఫ్డ్ ఫిక్స్‌డ్-లైన్ నెట్‌వర్క్ ఫోన్ ద్వారా హిందీలో బందర్‌ మారా గయా(కోతి చంపబడింది) అని వైమానిక దళం అజిత్‌ దోవల్‌ కు సమాచారం అందిందని ధనోవా తెలిపారు.


Next Story

Most Viewed