2022లో రికార్డు స్థాయిలో ట్రయల్ కోర్టులు విధించిన ఉరిశిక్షలు.. 22 ఏళ్లలో ఇదే అత్యధికం

by Dishanational4 |
2022లో రికార్డు స్థాయిలో ట్రయల్ కోర్టులు విధించిన ఉరిశిక్షలు.. 22 ఏళ్లలో ఇదే అత్యధికం
X

దిశ, వెబ్‌డెస్క్: గత 22 ఏళ్లలో 2022లోనే ట్రయల్ కోర్టులు అత్యధికంగా ఉరిశిక్షలు విధించినట్లు ఓ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రయల్ కోర్టులు గతేడాది 165 ఉరిశిక్షలు విధించినట్లు తెలిపింది. 2000 తర్వాత ఒక ఏడాదిలో ఇంత మందికి శిక్షలు విధించడం ఇదే తొలిసారని వెల్లడించింది. నేషనల్ లా యూనివర్సిటీ 'డెత్ పెనాల్టీ ఆఫ్ ఇండియా, ఆన్వల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ 2022' పేరుతో నివేదికను విడుదల చేసింది. అంతేకాకుండా 2022లో 539 మందికి ఉరిశిక్ష అమలు చేయగా, 2016 తర్వాత ఇదే అత్యధికమని పేర్కొంది.

అప్పీలేట్ కోర్టుల ద్వారా తక్కువ రేటు విధింపుతో ట్రయల్ కోర్టులు అధిక సంఖ్యలో మరణ శిక్షలను విధించడాన్ని అధిక సంఖ్యలో సూచిస్తున్నాయని నివేదికలో తెలిపింది. గతేడాది అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి కోర్టు విధించిన సంగతి తెలిసింది. ఒక్క కేసులో ఇంత మందికి శిక్ష పడటం కూడా గత ఆరేళ్లలో ఇదే అత్యధికం. కాగా, సుప్రీంకోర్టు 11, హైకోర్టు 68 అంశాల్లో ఉరి శిక్షను నిర్ణయించాయని పేర్కొంది.



Next Story