- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
16 ఏళ్ల బాలిక దారుణ హత్య
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు 16 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని తగులబెట్టారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు నారాయణపేట్ జిల్లా రాంకొండ గ్రామస్తురాలు అని గుర్తించారు. గాలేరు-నగరి ప్రాజెక్టు పనుల్లో భాగంగా కూలీ పనికోసం తండ్రితో కలిసి వచ్చిందని వెల్లడించారు. ఇటీవల ఓ యువకుడితో కూతురు సఖ్యతగా ఉందని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు 16 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని తగులబెట్టారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు నారాయణపేట్ జిల్లా రాంకొండ గ్రామస్తురాలు అని గుర్తించారు. గాలేరు-నగరి ప్రాజెక్టు పనుల్లో భాగంగా కూలీ పనికోసం తండ్రితో కలిసి వచ్చిందని వెల్లడించారు. ఇటీవల ఓ యువకుడితో కూతురు సఖ్యతగా ఉందని తండ్రి ఆగ్రహించాడని తెలిపారు. దీంతో బాలిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక తండ్రి రాములయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






