13 ఏళ్ల బాలికకు సత్య నాదెళ్ల థ్యాంక్యూ

by  |
13 ఏళ్ల బాలికకు సత్య నాదెళ్ల థ్యాంక్యూ
X

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, ఓ పదమూడేళ్ల విద్యార్థినికి థ్యాంక్యూ చెప్పారు. లూథియానాలోని సత్పల్ మిట్టల్ స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్న నమ్య జోషి సాంకేతికత ఉపయోగించి తీసుకొస్తున్న కొత్త ఒరవడిని తీసుకొచ్చిన సందర్భంగా నాదెళ్ల థ్యాంక్యూ చెప్పారు. మైన్‌క్రాఫ్ట్ ఆట ద్వారా నమ్య Sజోషి తన స్కూళ్లో టీచర్లతో పాటు ఇతర టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తోంది. పుస్తకాలు చదవడానికి పెద్దగా ఆసక్తి చూపని చిన్నారులు కూడా మైన్‌క్రాఫ్ట్ ద్వారా నేర్పిస్తే నేర్చుకుంటారని నమ్య జోషి అంది.

ఢిల్లీలో జరిగిన యంగ్ ఇన్నోవేటర్స్ సమ్మిట్‌లో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. టెక్నాలజీని, లెర్నింగ్‌ని కొత్త విధానంలో సమన్వయం చేస్తున్న చిన్నారుల శ్రమను ఆయన అభినందించారు. వారి ఐడియాలు, లక్ష్యాలు చాలా పట్టుదలతో కూడినట్లు అనిపిస్తున్నాయని అన్నారు. దాదాపు 250 మంది విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో ఎన్నో సమస్యలకు టెక్నాలజీ ద్వారా పరిష్కారాన్ని చూపించారు. ప్రతీక్ మోహపాత్ర తయారు చేసిన ఆర్గాన్‌సెక్యూర్ ప్లాట్‌ఫాం ద్వారా అవయవదానం అవసరమైన వారికి సాయం చేయొచ్చు. ఇంకా ఇష్లోక్ వాషిష్ట బృందం తయారుచేసిన కెయిలీ మాస్క్ గాలి కాలుష్యం నుంచి రక్షణనిస్తుంది. మరెన్నో ఇన్నోవేషన్లు ఈ సదస్సులో కనిపించాయి.


Next Story

Most Viewed