13 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్..

352

దిశ, క్రైమ్‌బ్యూరో : హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 మంది హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (సివిల్)గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా బషీర్‌బాగ్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ ఏఎస్ఐగా పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లను అభినందించారు.

ప్రమోషన్లు పొందిన వారిలో వి.గంగాధరణ్ నాయర్ (నల్లకుంట), ఎన్.సుబ్బారావు (మలక్ పేట), విజయ్ మోహన్ (లాలాగూడ), ఎ.లక్ష్మణ్ (జూబ్లీహిల్స్), ఎండీ వాహీద్ ఖురేషీ (సీఎస్‌డబ్ల్యూ), బి.కిషన్ (మార్కెట్), సుబ్రమణ్యం (డీడీ), జాన్ బాబు (కాలాపత్తర్), జి.లక్మణ్ (ఎస్బీ), బ్రహ్మనాయుడు (చార్మినార్), వెంకటరావు (గోపాలపురం), యాదవ్ గౌడ్ (ట్రాఫిక్ బ్రాంచ్), వెంకటేశ్వర్లు (డీడీ) ఉన్నారు. కొత్త విధుల్లో ఉత్తమంగా రాణించాలని, నగర పోలీసుల ప్రతిష్టను పెంచేందుకు విశేషంగా కృషి చేయాలని సీపీ అంజనీకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ శిఖా గోయెల్ తదితరులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..