12 లక్షల మంది పైసల్ తీసుకున్నారు!

by  |
12 లక్షల మంది పైసల్ తీసుకున్నారు!
X

దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) నుంచి 12 లక్షల మంది రూ. 3,360 కోట్లను ఉపసంహరించుకున్నారని ఆదివారం విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ వల్ల అనేకమంది ఉపాధిని కోల్పోయారని, సంస్థలు సెలవులను ప్రకటించడం, వేతనాలను పూర్తిగా చెల్లించకపోవడంతో సగం జీతాలనే తీసుకుంటున్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈపీఎఫ్ విత్ డ్రా చేసుకోవడానికి అవకాశమిచ్చింది. మార్చి 28 నుంచి ఇప్పటివరకూ మొత్తం 12 లక్షల మంది ఉద్యోగులు తమ ఈపీఎఫ్ నుంచి నగదును విత్ డ్రా చేసుకున్నారని ఆర్థిక మంత్రి చెప్పారు. కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ యోజన కింద ఈ మొత్తాన్ని చెల్లించడం జరిగింది. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికుల అకౌంట్లలో రూ. 3,955 కోట్లను జమ చేసినట్లు వివరించారు.

ఇంతకుముందు చెప్పినట్టు ఉద్యోగుల 12 శాతం ఈపీఎఫ్ వాటాను ఉద్యోగులు, యజమానుల తరపు నుంచి ప్రభుత్వమే ఇంకో మూడు నెలల పాటు చెల్లించనున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పిన విషయం తెలిసిందే. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు, యజమానుల చేతిలో మరికొంత నగదు ఉండేందుకు ఈపీఎఫ్ వాటాను మూడు నెలల వరకు కేంద్రం 2 శాతం తగ్గించింది. ప్రస్తుతం 12 శాతం వరకూ ఉన్న దీన్ని మూడు నెలలు 10 శాతానికి పరిమితం చేసింది. ఈ నిర్ణయం వల్ల ప్రవేట్ సంస్థ యజమానికి 2 శాతం నగదు మిగిలితే, ఉద్యోగికి 2 శాతం వేతనం అధికంగా చేతికొస్తుంది.

Next Story

Most Viewed