దుర్గ పూజలో అపశృతి.. దుండగుల కాల్పుల్లో ఒకరు మృతి, చిన్నారులకు గాయాలు

59

దిశ, వెబ్‌డెస్క్ : యూపీలోని అయోధ్యలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అయోధ్యలోని కోర్ఖానా ప్రాంతంలో దుర్గ పూజ పండల్‌లో నలుగురు యువకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మృతిచెందగా, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి దుర్గా పూజ పండల్‌లోకి నలుగురు యువకులు వాహనాలతో వచ్చి అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిని చిన్నారులను సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్టు అయోధ్య ఎస్పీ శైలేష్ పాండే తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..