మీ పిల్లలు యూట్యూబ్ చూస్తున్నారా.. అశ్లీల వీడియోలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి...

by Dishafeatures3 |
మీ పిల్లలు యూట్యూబ్ చూస్తున్నారా.. అశ్లీల వీడియోలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి...
X

దిశ, ఫీచర్స్ : ఉద్యోగాలతో సతమతం అవుతున్న తల్లిదండ్రులు పిల్లలను సముదాయించే ఓపిక లేక సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. అది ఇస్తే కానీ ఊరుకోవట్లేదని డిసైడ్ అయిపోతున్నారు. కానీ దీని వల్ల చిన్నారుల కళ్ల మీద ఎఫెక్ట్ పడటంతోపాటు డెవలప్మెంటల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు మరో ప్రమాదకరమైన పరిస్థితి.. అశ్లీల కంటెంట్. పిల్లలు మొబైల్ చూస్తున్నప్పుడు మానిటరింగ్ చేయకపోతే వారు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారనేది తెలియదు. ఒకవేళ వారు షాట్స్, రీల్స్ లాంటివి చూస్తున్నప్పుడు అశ్లీల, అసభ్యకరమైన వీడియోలు వస్తే చెడిపోయే ప్రమాదం ఉంది.పైగా ఒక్కసారి అలాంటి వీడియోలు చూస్తే పదే పదే వస్తాయన్న విషయం తెలిసిందే. కాగా వీటికే అడిక్ట్ అయిపోయే పరిస్థితి తలెత్తుతుంది. వారి ఎదుగుదలపై ఎఫెక్ట్ పడే చాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటివి రాకుండా మీ యూట్యూబ్‌లో సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది.



* ముందుగా మీ ఫోన్‌లో యూట్యూబ్ ఓపెన్ చేసి.. మీ ప్రొఫైల్‌ సెలెక్ట్ చేసుకోవాలి.

* ఆ తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. జనరల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

* అందులో రిస్ట్రిక్టెడ్ మోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆన్ చేయాలి.

* అంతే మీ పిల్లలు చూస్తున్నప్పుడు వచ్చే అభ్యంతరకర వీడియోలు కనిపించడం ఆగిపోతాయి.

* వీటితోపాటు కొన్ని పేరెంటింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని యూజ్ చేస్తే మీ పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారనే విషయం ఈజీగా తెలుసుకోవచ్చు.



Next Story

Most Viewed