ఆస్పత్రిలో చేరిన ప్రముఖ కమెడియన్.. కన్నీరు పెడుతూ వీడియో!

by Disha Web Desk 8 |
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ కమెడియన్.. కన్నీరు పెడుతూ వీడియో!
X

దిశ, సినిమా : తన కామెడీ టైమింగ్‌తో ఎంత మందిని కడుపుబ్బా నవ్వించే కమెడియన్ భారతీ సింగ్ ఆసుపత్రిలో చేరారు. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. తన పేరు వినగానే మనకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు వస్తుంది. అంతలా ఆమె తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె స్టార్ వన్ లో వచ్చే గ్రేట్ ఇండియన్ లాఫర్ ఛాలెంజ్ షోలో రన్నరప్ గా నిలవడం ద్వారా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కామెడీ సర్కస్ లో ఓ కంటెస్టెంట్ గా పోటీ చేసింది. ఆ షో ద్వారానే ఆమె పేరు సంపాదించింది. ఆ తర్వాత ఆమె కామెడీ షోలు చేయడమే కాకుండా ఎన్నో షోలకు హోస్ట్‌గా చేసింది. అలాగే పలు సినిమాల్లో కూడా నటించి అలరించింది.

అయితే తాజాగా ఈమె అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో భారతీ సింగ్ కన్నీరు పెడుతూ.. కడుపు నొప్పిగా ఉందని ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి వచ్చాను. కానీ వారు గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయని, స్జరీ చేయాలని చెప్పారు. కొద్దిసేపట్లో సర్జరీ చేయనున్నారు..నొప్పిని భరించలేక పోతున్నాను. చాలా రోజుల నుంచే కడుపులో నొప్పి వస్తుంది. కానీ నేను లైట్ తీసుకున్నాను. కానీ ఆ సమస్య ఇప్పుడు ఎక్కువై పోయింది. భరించలేని నొప్పిగా ఉందంటూ కన్నీరు పెట్టుకుంది. అంతే కాకుండా ఆస్పత్రిలో తనను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న వారికి థాంక్స్ చెప్పింది.. ఈ సర్జరీ కారణంగా తన కొడుకుకు దూరంగా ఉంటున్నందుకు ఆమె ఎమోషనల్ అయ్యింది.

Next Story

Most Viewed