హీరోయిన్ రష్మికను టార్గెట్ చేసిన మాజీ మంత్రి.. నెట్టింట దుమారం రేపుతోన్న ట్వీట్?

by Anjali |
హీరోయిన్ రష్మికను టార్గెట్ చేసిన మాజీ మంత్రి.. నెట్టింట దుమారం రేపుతోన్న ట్వీట్?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ఇటీవల సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తుంది. ఈ నేషనల్ క్రష్ చేసిన ట్వీట్ కు దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి.. ఆయన ఆనందపడేలోగా రష్మికను టార్గెట్ చేస్తూ విమర్శలతో నెట్టింట నెగిటివ్ పోస్ట్ లు పెట్టడం స్టార్ చేశారు జనాలు. అయితే ఈ పోస్ట్ లో రష్మిక అటుల్ సేతుపై ప్రయాణిస్తూ ప్రశంసలు కురిపించింది. ‘‘ఇలాంటి ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరని, అసాధ్యం అనుకున్న దాన్ని ఏడేళ్ల వ్యవధిలో సుసాధ్యం చేశారని’’ రష్మిక ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉద్దవ్ థాక్రే కుమారుడు మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాక్రరే రష్మిక పేరు తీయకుండానే ఆమె గురించి మాట్లాడినట్లు తెలుస్తుందని జనాలు చర్చించుకుంటున్నారు. ఒక నటి సడన్‌గా ప్రస్తుత పాలనలో అటల్ సేతుగా బ్రాండ్ చేయబడిన ఎమ్‌టీహెచ్‌ఎల్ పై ఒక ప్రకటన చేయడం నేను చూశాను. దానికి సంభందించిన కొన్ని వాస్తవాలు అంటూ కొన్ని అంశాలు హైలెట్ చేస్తూ ట్వీట్ చేసారు. అలాగే ఆమె చివర్లో మేల్కొని అభివృద్ధికి ఓటు వేయండి చెప్పిందని, అదే కరెక్ట్, ఎందుకంటే దాని అర్థం బీజేపీకి ఓటు వేయవద్దు అని రాసుకొచ్చారు. కానీ ఇటువంటి ప్రమోషన్లు చేస్తున్న వారందరికీ వినయపూర్వకమైన అభ్యర్థన చేస్తున్నాను. దయచేసి వాస్తవమేంటో తెలుసుకోండి. కొన్ని పార్టీలు నటీనటులను ‘వార్ రుఖ్వా ద’ తరహా ప్రకటనలు చేయిస్తున్నాయి. అంటూ పోస్ట్ లో చెప్పుకొచ్చారు.

For Aaditya Thackeray tweet

Next Story