Jupiter : జుపిటర్‌పై వింత ఆకారాన్ని గుర్తించిన సైంటి‌స్టులు.. పరిశోధనల్లో ఏం తెలిసిందంటే.. (వీడియో)

by Dishafeatures2 |
Jupiter : జుపిటర్‌పై వింత ఆకారాన్ని గుర్తించిన సైంటి‌స్టులు.. పరిశోధనల్లో ఏం తెలిసిందంటే.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : సౌర వ్యవస్థలో వివిధ గ్రహాలు, నక్షత్రాల పనితీరు. వాటిపై జీవం ఉనికిని తెలుసుకునేందు సైంటిస్టులు నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఇది వరకే అనేక విషయాలను కనుగొన్నారు. జుపిటర్, అలాగే శని గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్న కొన్ని ఉపగ్రహాల్లో మంచు, నీరు, జీవజాలం ఉనికికి సహాయపడే పదార్థాలు ఉన్నాయని ఇప్పటికే గుర్తించిన శాస్త్రవేత్తలు రీసెంట్‌గా జుపిటర్ గ్రహం చుట్టూ తిరిగే మరొక గ్రహం అయిన ‘అయో’పై ఫోకస్ చేశారు.

బృహస్పతి, గురు గ్రహాలుగా కూడా పిలిచే జుపిటర్‌ యొక్క ఉపగ్రహం ‘అయో’పై పరిశోధనలు నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలకు దానిపై భారీ టవర్‌లాంటి ఒక వింత ఆకారం కనిపించింది. నాసా ‘జునో’ స్పేస్ టెక్నాలజీ ద్వారా వారు దానిని చిత్రీకరించి, విశ్లేషించగా అసలు విషయం బయటపడింది. ఏంటంటే.. అక్కడ పెద్ద సంఖ్యలో అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఒక అగ్ని పర్వతం నుంచి పెల్లుబికిన లావానే ఆ వింత ఆకారమని కనుగొన్నారు. ఇది క్రమంగా గట్టి పడుతూ, అద్దంలా మెరిసిపోతూ ఒక టవర్‌లా మారిందని నాసా సైంటిస్టు స్కాట్ బోల్టన్ పేర్కొన్నారు. ఇదొక్కటే కాదు ఈ గ్రహంపై ఇంకా చాలా అగ్ని పర్వతాలు ఉన్నాయని, అవన్నీ నిరంతరం లావాను వెదజల్లుతున్నాయని తెలిపారు.


Next Story

Most Viewed