బిగ్ బాస్ లవర్స్‌కి క్రేజి న్యూస్.. సీజన్ 8 ఎప్పుడు మొదలవ్వబోతుంది అంటే..?

by Kavitha |
బిగ్ బాస్ లవర్స్‌కి క్రేజి న్యూస్.. సీజన్ 8 ఎప్పుడు మొదలవ్వబోతుంది అంటే..?
X

దిశ, సినిమా: తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్. సాధారణంగా బిగ్ బాస్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఆ గొడవలు, ఆ అల్లర్లు, ఆ గిల్లికజ్జాలు చాలా చాలా బాగుంటాయి. అయితే ఇప్పటి వరకు బిగ్‌బాస్ 7 సీజన్లు కంప్లీట్ చేసుకోగా త్వరలోనే సీజన్ 8 రాబోతుంది. ఇప్పుడు ఈ న్యూస్ బుల్లితెరలోనే హాట్ టాపిక్‌గా మారింది.

అయితే మొదటి సీజన్ కి ఎన్టీఆర్ ఆ తర్వాత సీజన్ కి నాని హోస్ట్ చేశారు . ఆ తర్వాత అన్ని సీజన్స్ కి నాగార్జున నే హోస్టింగ్ చేశారు. కాగా ఇప్పుడు ఈ సీజన్ కి హోస్ట్ గా మళ్లీ అక్కినేని నాగార్జున నే హోస్ట్ చేయబోతున్నాడు అన్న వార్త అభిమానులకు నిరాశ కలిగిస్తుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 8కి బాలకృష్ణ లేదా విజయ్ దేవరకొండ లేదా రానా దగ్గుబాటి హోస్ట్ చేయబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. కానీ సీన్ కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా నాగార్జుననే హోస్టింగ్ చేయబోతున్నాడు అంటూ ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

అంతేకాదు ఈ సీజన్ మరింత రసవత్తరంగా ప్లాన్ చేస్తున్నారట. స్టార్ కపుల్స్ ని కూడా జంటగా లోపలికి పంపించబోతున్నారట. అలాగే ఈసారి టిఆర్పిని పెంచేందుకు సరికొత్త టాస్కులు కూడా పెట్టబోతున్నారట. అంతేకాకుండా జూన్ మొదటి వారంలో బిగ్ బాస్ షో సీజన్ 8 స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తలో నిజం ఎంతుందో అని తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.

Next Story

Most Viewed