పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య..

124
shrisha

దిశ, ఖానాపూర్ : పెంబి మండలంలోని ఇటిక్యాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుంచు శిరీష (18) ఆదివారం పురుగుల మందు తాగి మృతిచెందింది. ఈ ఘటనపై ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన సుంచు లస్మయ్య, నర్సవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.

అయితే, కూతురు శిరీష ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగడంతో గమనించిన స్థానికులు వెంటనే శిరీషను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శిరీష మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే యువతి ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..