75వ స్వాతంత్య్ర దినోత్సవం.. 75 కిలోమీటర్ల యాత్ర

by  |
YONG MANS
X

దిశ, వెబ్‌డెస్క్: సెల్ ఫోన్లకే పరిమితమైన నేటి యువతలోనూ దేశభక్తి ఉన్నదని నిరూపించారు ముగ్గురు యువకులు. ఆగస్ట్ 15 సందర్భంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అధికారుల మెప్పుపొందారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఈ యువకులు చేసిన పనికి ప్రజలు ఫిదా అవుతున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఫిట్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ నిర్వహించిన రన్-రైడ్-వాక్ ఫర్ ఒలింపిక్స్ ఈవెంట్‌ రైడ్ విభాగంలో సూర్యాపేటకు చెందిన జి.భానుప్రసాద్, డి.ఉప్పలయ్య, టి.సురేష్ అనే ముగ్గురు యువకులు పాల్గొన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకోని 75 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం సైకిల్‌కు జాతీయ జెండాలు కట్టుకొని సూర్యాపేట నుండి బయలుదేరి నకిరేకల్ మీదుగా అర్వపల్లి, అక్కడి నుంచి తిరిగి సూర్యాపేట చేరుకొని 75 కిలోమీటర్ల సైక్లింగ్ రైడ్ పూర్తి చేసి దేశభక్తిని చాటుకున్నారు. వీరికి సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ఉత్తమ యువత ప్రశంస పత్రాలతోపాటు మెడల్స్‌ను అందజేసి ముగ్గురు యువకులను సత్కరించారు.



Next Story

Most Viewed