యువకుడికి దెయ్యం పట్టిందని భూతవైద్యులు ఏం చేశారంటే?

by  |
యువకుడికి దెయ్యం పట్టిందని భూతవైద్యులు ఏం చేశారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ పెరిగిపోతుంది. మానవుడు తన మేధస్సునుపయోగించి ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నాడు. అయినా ఈ కంప్యూటర్ యుగంలో కూడా మూఢనమ్మకాలు అనేవి ప్రజలను వదలడం లేదు. దీనికి మదనపల్లె లాంటి అనేక సంఘటనలే నిదర్శణం. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. భూతవైద్యం పేరుతో యువకుడు మరణించిన ఘటన జిల్లాలోని మద్దికెర మండలం పెరవలిలో చోటుచేసుకుంది.

నరేష్ (25) యువకుడు గత పదిరోజుల నుంచి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. అతన్ని వాళ్ల తల్లిదండ్రులు భూతవైద్యునికి చూపించారు. అతనికి దెయ్యం పట్టిందని దాన్ని వదిలిస్తానంటూ ఆ భూతవైద్యులు యువకున్ని ఈతబరిగలతో విపరీతంగా కొట్టారు. దీంతో నరేష్‌కు తీవ్రగాయాలయ్యాయి, తలకు గాయం వలన పరిస్థితి మరింత విషమించింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు తల్లిదండ్రులను మందలించి కర్నూలులోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మూడురోజులుగా మృత్యువుతో పోరాడిన నరేశ్‌ ఆదివారం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో మిత్రులే డబ్బులు పోగుచేసి అంత్యక్రియలు నిర్వహించారు. నరేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed