‘ఆ రోజు.. సీసీ కెమెరాలు ప‌నిచేయ‌లేదు’

by  |
‘ఆ రోజు.. సీసీ కెమెరాలు ప‌నిచేయ‌లేదు’
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటల్లో దహనం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నాయి. కాగా ప్రతిపక్షాల నిరసనలపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో గతంలో 2017 టీడీపీ హయాంలో తూర్పు గోదావరి జిల్లా కే.పెంటపాడు గ్రామంలోని శ్రీ గోపాల‌స్వామి ఆల‌యంలో చారిత్ర‌క దివ్య ర‌థం ద‌గ్ధ‌మైన విషయాన్ని వెలికితీసారు. దీనిపై శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. నాడు గోపాలస్వామి ఆలయంలో దివ్య రథం దగ్ధం అయిన సమయంలో ‘సీసీ కెమెరాలు ప‌నిచేయ‌లేదు. సీబీఐ విచార‌ణ కోర‌లేదు. ఈవోని స‌స్పెండ్ చేయ‌లేదు. కొత్త ర‌థానికి ఒక్క రూపాయి కేటాయించ‌లేదు.’ అని గుర్తు చేశారు.


Next Story