పేదల కోసమే పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ : ఎమ్మెల్యే యెన్నం

by Disha Web Desk 11 |
పేదల కోసమే పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ : ఎమ్మెల్యే యెన్నం
X

దిశ, హన్వాడ : పేదల కోసమే పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హన్వాడ మండలంలోని వెంకటమ్మ కుంట తండా, దయ్యాల మర్రి తండా, దాచక్ పల్లి, టంకర , గుడ్డి మల్కాపూర్, రాంనాయక్ తండా లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతు రుణమాఫీ ఆగస్టు 15లోగా చేస్తామని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం బోరు వేయించి ప్రజల దాహార్తిని తీర్చుతామని ఆయన స్పష్టం చేశారు. పేదల కష్టాలు తెలిసిన పార్టీ, ఆ కష్టాలు తొలగించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు.

గత బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పేదల కోసం చేసింది ఏమీ లేదు అని , పెద్ద చదువులు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదని యెన్నం విమర్శించారు. మహిళా సంఘాలకు కోటి రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేసి మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని అందుకే ఇండ్లు లేని నిరుపేదలకు సంవత్సరానికి నియోజకవర్గానికి 4,000 ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని, పెన్షన్ రాలేని వారికి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పెన్షన్ ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మారేపల్లి సురేందర్ రెడ్డి, లక్ష్మణ్ నాయక్, రాజు నాయక్, నవనీత, మహేందర్, కృష్ణయ్య, రమేష్ యాదవ్, నర్సింహులు యాదవ్, రామచందర్ నాయక్, పర్షినాయక్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed