తూర్పు కాంగోలో ఉగ్ర దాడి.. 22 మంది మృతి

by Disha Web Desk 1 |
తూర్పు కాంగోలో ఉగ్ర దాడి.. 22 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణాఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ఉగ్రవాదుల దాడుల్లో తాజాగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు ఇటూరి, నార్త్ కివులో శనివారం జరిగిన వరుస దాడుల్లో 22 మంది చనిపోయారు. వివ‌రాల్లోకి వెళితే.. కాంగోలో పౌరులను లక్ష్యంగా చేసుకుని మిటిటెంట్ల దాడులు అక్క‌డి ప‌రిస్థితుల‌ను మ‌రింత‌గా దిగ‌జారుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తూర్పు కాంగోలో ఉగ్రవాదుల దాడుల్లో 22 మంది మృతి చెందారు. ఇటూరి ప్రావిన్స్ లోని పలు గ్రామాల్లో జరిగిన దాడుల్లో 12 మంది మృతి చెందారు.

అదేవిధంగా నార్త్ కివులోని క్యావిరిము పర్వతం దిగువన ఉన్న ఎన్గులి గ్రామంలో ఉగ్రవాదులు 10 మందిని హతమార్చరు. మరో ముగ్గురిని ఉగ్రవాదులు అపహరించార‌ని అంత‌ర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, కొన్నేళ్లుగా కాంగోలో మకాం వేసిన ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలకు కూడా ఈ విషయం తెలికపోవడం గమనార్హం. అయితే.. ఆల‌స్యంగా ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కాంగో, ఐక్యరాజ్యసమితి దళాల మధ్య జరిగిన ఘర్షణలో మిలిటెంట్లు ఇంత పెద్ద దాడికి పాల్పడటం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి.


Next Story

Most Viewed