ఆఫ్ఘనిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: ముగ్గురు మృతి

by Dishanational2 |
ఆఫ్ఘనిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: ముగ్గురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ నగరంలో గురువారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా..12మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనను కాందహార్ ప్రావిన్స్ సమాచార శాఖ డైరెక్టర్ ఇనాముల్లా సమంగాని ధ్రువీకరించారు. కాందహార్‌లోని న్యూ కాబూల్ బ్యాంక్ వద్ద కొంత మంది పౌరుతు తమ వేతనాలు తీసుకోవడానికి గుమిగూడారు. ఈ క్రమంలోనే పేలుడు సంభవించినట్టు తెలిపారు. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తాలిబాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ కూడా దాడిపై స్పందించారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అయితే ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, దాని అనుబంధ సంస్థ తాలిబాన్ దేశవ్యాప్తంగా పాఠశాలలు , ఆస్పత్రులు, మసీదులపై గతంలో దాడులు నిర్వహించింది. కాగా, 2021 ఆగస్టులో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి ఆప్ఘన్‌లో బాంబు పేలుళ్లు, ఆత్మహుతి దాడుల సంఖ్య గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed