పుతిన్‌‌కు లైన్ క్లియర్.. మరో అధ్యక్ష అభ్యర్థిపై బ్యాన్

by Dishanational4 |
పుతిన్‌‌కు లైన్ క్లియర్.. మరో అధ్యక్ష అభ్యర్థిపై బ్యాన్
X

దిశ, నేషనల్ బ్యూరో : మార్చిలో జరగనున్న రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌కు లైన్ క్లియర్ అయింది. బోరిస్ నదేజ్డిన్ అనే అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయకుండా రష్యా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. అధ్యక్ష అభ్యర్ధిత్వం కోసం ఆయన సమర్పించిన లక్ష మంది మద్దతుదారుల సంతకాల్లో దాదాపు 9వేల (9 శాతం) సంతకాలు నకిలీవని దర్యాప్తులో గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు సమర్పించే సంతకాల్లో నకిలీల సంఖ్య 5 శాతానికి మించితే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు వేయాలనే నిబంధన ప్రకారమే బోరిస్ నదేజ్డిన్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. మరో అధ్యక్ష అభ్యర్థి యెకాటెరినా డంత్సోవాపైనా ఇటీవల రష్యా ఎన్నికల సంఘం బ్యాన్ విధించింది. అప్లికేషన్ ఫామ్‌లో అక్షర దోషాలను కారణంగా చూపించి డంత్సోవా అధ్యక్ష అభ్యర్ధిత్వాన్ని నిలుపుదల చేయడం గమనార్హం.



Next Story

Most Viewed