రిషి సునాక్‌తో రాజ్‌నాథ్ సింగ్ భేటీ: పలు కీలక అంశాలపై డిస్కషన్

by Dishanational2 |
రిషి సునాక్‌తో రాజ్‌నాథ్ సింగ్ భేటీ: పలు కీలక అంశాలపై డిస్కషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు రాజ్‌నాథ్ సింగ్ లండన్‌లోని ట్రినిటీ హౌస్‌లో జరిగిన ఇండియా-యూకే డిఫెన్స్ ఇండస్ట్రీ సీఈఓల రౌండ్‌టేబుల్‌ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్‌లో భాగంగా 2025లో క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ భారత జలాలను సందర్శించాలనే ప్రతిపాదనతో బ్రిటన్ తన లిటోరల్ రెస్పాన్స్ గ్రూప్‌ను ఈ ఏడాది చివర్లో హిందూ మహాసముద్ర ప్రాంతానికి పంపే ప్రణాళికలను ప్రకటించినట్టు యూకే డిఫెన్స్ సెక్రటరీ షాప్స్ ప్రకటించారు. అంతేగాక బ్రిటన్‌, భారత్‌లు సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశాయి. ‘ప్రపంచంలో అనేక రంగాల్లో పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ వంటి కీలక భాగస్వాములతో మా వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యం. భారత్‌తో కలిసి భద్రతా సవాళ్లను పంచుకుంటాం. దీనిపై ఎంతో నిబద్దతతో ఉన్నాం’ అని డిఫెన్స్ సెక్రటరీ షాప్స్ తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ..భారత్ - బ్రిటన్ లు బలపైన వ్యూహాత్మక సంబందాలను కోరుకుంటున్నాయని ఆ దిశగా పనిచేస్తున్నాయని చెప్పారు. కాగా, భారత రక్షణ మంత్రి బ్రిటన్‌లో పర్యటించడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Next Story

Most Viewed