పుతిన్‌తో జిన్‌పింగ్‌ భేటీ

by Dishafeatures2 |
పుతిన్‌తో జిన్‌పింగ్‌ భేటీ
X

మాస్కో: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సోమవారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న తీవ్ర సంక్షోభంపై చైనా రూపొందించిన ప్రణాళికను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సందర్భంగా స్వాగతించారు. గత కొన్నేళ్లుగా చైనా దూకుడును ప్రదర్శిస్తోందని పుతిన్ అన్నారు. ‘గత కొన్ని సంవత్సరాలుగా చైనా దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇది యావత్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దురదృష్టవశాత్తు అసూయను కూడా కలిగిస్తోంది. చైనా ప్రతినిధిగా ఎన్నుకున్న పది సంవత్సరాల తర్వాత మనము ఇక్కడ కలుసుకున్నాం. ఈ సమయంలో మనము సంబంధాలలో పురోగతి సాధించాం. మాకు సాధారణంగానే కొన్ని ఆసక్తులు, లక్ష్యాలు ఉన్నాయి’ అని పుతిన్ చెప్పారు.

తాము చర్చలకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని, మీ సూచనతో పాటు అన్ని ప్రశ్నలను చర్చిస్తామని రష్యా అధ్యక్షుడు అన్నారు. జిన్‌పింగ్ మూడ్రోజుల రష్యా పర్యటనలో ఉక్రెయిన్ యుద్ధం చర్చకు రానుంది. వీరిద్దరి మధ్య శాంత్రి ప్రణాళిక కూడా చర్చకు వచ్చే అవకాశముంది. చైనా, రష్యాలు నమ్మదగిన భాగస్వాములుగా జిన్‌పింగ్ అభివర్ణించారు. గతేడాది ఉక్రెయిన్‌పై పుతిన్ దాడి అనంతరం జిన్‌పింగ్ రష్యా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ‘ఈ పర్యటన ఫలప్రదంగా ఉంటుందిని.. చైనా-రష్యా సంబంధాలు ఆరోగ్యకరమైన, స్థిరమైన అభివృద్ధికి కొత్త ఊపును ఇస్తుందని నేను విశ్వసిస్తున్నాను’ అని జిన్‌పింగ్ అన్నారు.



Next Story

Most Viewed