Pensioner Dead Body | స్నేహితుడి డబ్బులు కాజేయడానికి మృతదేహాన్ని రెండేళ్లు ఫ్రీజర్లో దాచిన వ్యక్తి

by Dishanational1 |
Pensioner Dead Body | స్నేహితుడి డబ్బులు కాజేయడానికి మృతదేహాన్ని రెండేళ్లు ఫ్రీజర్లో దాచిన వ్యక్తి
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ పెన్షనర్ మృతదేహాన్ని ఓ వ్యక్తి రెండేళ్ల పాటు ఫ్రీజర్లో ఉంచాడు. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి షాపింగ్ చేశాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. విచిత్రం ఏమిటంటే.. నిందితుడు ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చాడు.

వివరాలు ఇలా ఉన్నాయి. యూకేకు చెందిన 71 ఏళ్ల జాన్ వెయిన్ రైట్, 52 ఏళ్ల డామియన్ జాన్సన్ ఓకే ఫ్లాట్ లో కలిసి ఉండేవారు. వీరిద్దరు హామ్ డౌన్ టౌన్ క్లీవ్ ల్యాండ్ టవర్, హోలీవెల్ హెడ్ లోని ఒక ఫ్లాట్ కలిసి జీవించేవారు. అయితే అందులో వెయిన్ రైట్ కు పెన్షన్ వస్తుండేది. ఈ క్రమంలో ఆయన 2018 సెప్టెంబర్ లో మరణించాడు. అయితే ఈ విషయం అతడి రూమ్ మేట్ ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టాడు. ఓ ఫ్రీజర్ తీసుకొచ్చి, ఆ డెడ్ బాడీని అందులోనే భద్రపర్చాడు.

తరువాత అతడి బ్యాంకు సంబంధించిన కార్డులను ఉపయోగించి షాపింగ్ చేసేవాడు. ఏటీఎంల ద్వారా డబ్బును డ్రా చేసేవాడు. అయితే జాన్ వెయిన్ రైట్ మరణించిన విషయం 2020 ఆగస్టు 22వ తేదీన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. దీంతో కోర్టులో విచారణ జరిగింది. తాజాగా తీర్పు వెలువడింది. అయితే తాను షాపింగ్ చేసిన డబ్బు తనదేనని కోర్టులో డామియన్ వాదించాడు.

తాము ఇద్దరం జాయింట్ బ్యాంక్ అకౌంట్ తెరిచామని, ఎప్పుడైనా ఆ డబ్బు తాను ఉపయోగించుకునే అర్హత ఉందని చెప్పారు. ఆ డబ్బు సాకేంతికంగా తనకే చెందుతుందని పేర్కొన్నారు. దీనికి కోర్టు ఏకీభవించింది. కానీ వెయిన్ రైట్ ను చట్టబద్ధంగా, మర్యాదగా ఖననం చేయకుండా అడ్డుకున్నారనే అభియోగాన్ని అంగీకరించారు. దీంతో కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అనంతరం బెయిల్ మంజూరు చేసింది.

కోల్‌కతాలో..

ఇలాంటి ఘటన ఒకటి భారతదేశంలోని కోల్‌కతాలో జరిగింది. 2015 సంవత్సరంలో కోల్‌కతాలోని రాబిన్‌సన్ స్ట్రీట్ వద్ద ఒక ఇంట్లో కెమికల్స్ ఘాటు వాసనకు అనుమానం రావడంతో అందులో వెళ్లి చూడగా.. ఒక ఫ్రిజ్‌లో 80 ఏళ్ల వృద్ధురాలు శవం బయటపడింది. పోలీసులు విచారణ చేయగా.. ఆమె కుమారుడు పెన్షన్ డబ్బుల కోసం తన తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో మూడేళ్లుగా దాచిపెట్టాడని తేలింది.


Next Story

Most Viewed