ఇండియాకు థ్యాంక్స్ చెప్పిన పాకిస్థానీ..! ఎందుకంటే?!

by Disha Web Desk 20 |
ఇండియాకు థ్యాంక్స్ చెప్పిన పాకిస్థానీ..! ఎందుకంటే?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః రష్యా-ఉక్రెయిన్‌ల‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ‌భూభాగంలో చిక్కుకున్న భార‌తీయ విద్యార్థుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లిస్తోంది ఇండియా. ఈ క్ర‌మంలో దాయిదులు పాకిస్థానీ విద్యార్థులను కూడా ఇండియ‌న్ ఎంబ‌సీ స‌రిహ‌ద్దులు దాటించింది. దీనితో తాజాగా ఓ పాకిస్థాన్ విద్యార్థిని భారత అధికారుల‌కు ధ‌న్య‌వాదాలు చెప్పింది. పాకిస్తాన్‌కు చెందిన అస్మా షఫీక్, కీవ్ న‌గ‌రంలోని భారత రాయబార కార్యాల‌యానికి, భార‌త ప్రధాని నరేంద్ర మోడీకీ కృతజ్ఞతలు తెలియ‌జేసింది. భారతీయుల వ‌ల్ల‌ మేము సురక్షితంగా ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్న‌ట్లు ఆమె చెప్పింది. ఈ వీడియోతో ఇరుదేశాల మ‌ధ్య మాన‌వ విలువ‌లు, ప్రేమాభిమానాలు ఉన్నాయ‌ని మ‌రోసారి రుజువ‌య్యింది. అందుకే, ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఇక‌, ఉక్రెయిన్‌లోని విదేశీయుల‌ను భారతదేశం రక్షించడం ఇదే మొదటిసారి కాదు. ఆపరేషన్ గంగా కింద ఒక బంగ్లాదేశ్ పౌరుడు, ఒక నేపాలీ పౌరుడు భారత‌ విమానంలో వస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఇటీవ‌ల తెలిపింది. ఉక్రెయిన్ నుండి తరలించబడిన మొదటి నేపాలీ జాతీయుడు రోషన్ ఝా. తర్వాత, పోలాండ్ నుండి భారత ప్రభుత్వం మరో ఏడుగురు నేపాలీలను తరలిస్తున్నట్లు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. కాగా, ఉక్రెయిన్‌లోని సుమీ న‌గ‌రం నుంచి భారతీయ విద్యార్థులందరినీ ఖాళీ చేయించినట్లు MEA మంగళవారం తెలియజేసింది.



Next Story

Most Viewed