4000 టెస్ట్‌ట్యూబ్ బేబీలు హతం.. ఎక్కడో తెలుసా ?

by Dishanational4 |
4000 టెస్ట్‌ట్యూబ్ బేబీలు హతం.. ఎక్కడో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : పాలస్తీనాలోని గాజా సిటీలో ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన అరాాాచకాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. గాజాలోని అతిపెద్ద ఐవీఎఫ్ సెంటర్ పేరు ‘అల్ బాస్మా’. ఇక సంతాన భాగ్యం లేదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో.. వేలాది మంది దంపతులు ఈ ఐవీఎఫ్ సెంటర్‌లోనే ట్రీట్మెంట్ చేయించుకున్నారు. పురుషుల నుంచి వీర్యాన్ని, మహిళల నుంచి అండాలను సేకరించి ‘అల్ బాస్మా’ ఐవీఎఫ్ సెంటర్‌లోని ఎంబ్రయాలజీ ల్యాబ్‌లో పిండాలుగా డెవలప్ చేశారు. అవి చేతికొచ్చే సమయానికి ఇజ్రాయెల్ దారుణానికి తెగబడింది. ఇజ్రాయెలీ సైనికులు తమ యుద్ధ ట్యాంకు నుంచి ఈ ఆస్పత్రిపైకి బాంబుల వర్షం కురిపించారు. దీంతో ల్యాబ్ అంతా అతలాకుతలమైంది. ల్యాబ్‌లో నిల్వ చేసి ఉంచిన దాదాపు 4వేల పిండాలు నేలపాలై ఛిద్రమయ్యాయి. మరో 1000 మందికి సంబంధించిన వీర్యాలు, అండాలు కూడా నాశనమయ్యాయి. ‘అల్ బాస్మా’ ఐవీఎఫ్ సెంటర్‌ను 1997 నుంచి తాను నిర్వహిస్తున్నానని 73 ఏళ్ల బహయెల్ దీన్ ఘలాయెనీ తెలిపారు. ఇజ్రాయెలీ సైనికుల అరాచకానికి.. తమ ల్యాబ్‌లో ప్రాణం పోసుకుంటున్న వేలాది పిండాలు కూడా బలయ్యాయని ఆయన ఆవేేదన వ్యక్తం చేశారు. సంతానం కోసం ఎంతో ఆశగా తన దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వేలాది మంది తల్లిదండ్రులను తలుచుకుంటే గుండె వెయ్యిముక్కలు అవుతోందని వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed