యాడ్స్‌లో విదేశీ మోడ‌ళ్ల‌ను పూర్తిగా నిషేధించిన మొట్ట‌మొద‌టి దేశం

by Disha Web Desk 20 |
యాడ్స్‌లో విదేశీ మోడ‌ళ్ల‌ను పూర్తిగా నిషేధించిన మొట్ట‌మొద‌టి దేశం
X

దిశ‌, వెబ్‌డెస్క్ః టీవీ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో విదేశీ మోడళ్లను తీసుకోవ‌డంపై పూర్తి నిషేధాన్ని ప్రకటించిన మొట్ట మొదటి దేశంగా నైజీరియా అవతరించింది. "స్థానిక ప్రతిభను అభివృద్ధి చేసే" ప్రయత్నంలో నైజీరియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు నైజీరియా అసోసియేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీల అధ్యక్షుడు స్టీవ్ బాబాకో తెలిపారు. ఈ సంవత్సరం అక్టోబర్ నుండి అధికారికంగా ఈ నియ‌మం అమల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. టైమ్స్ నివేదిక‌ ప్రకారం, నిషేధం అమ‌లు త‌ర్వాత‌ నైజీరియన్లు కాని మోడల్స్, వాయిస్‌ఓవర్ ఆర్టిస్టులందరూ దేశంలో పని చేయలేరు. ఇది భారీ సాంస్కృతిక మార్పుకు కార‌ణం అవుతుందనే చ‌ర్చ న‌డుస్తుంది. కాగా, స్థానిక బీర్ బ్రాండ్ గిన్నిస్‌లో "బ్లాక్ షైన్స్ బ్రైటెస్ట్" ప్రచారాన్ని షూట్ చేయడానికి స్థానిక మోడల్స్, డైరెక్టర్‌ను ఉపయోగించిన యాడ్ ఏజెన్సీ AMV BBDO ఈ మార్పును ఆహ్వానించిన‌ మొదటి కంపెనీలలో ఒకటిగా ఉంది.

ఇక‌, నైజీరియన్ టెలివిజన్‌లో 20 సంవ‌త్స‌రాల క్రితం ప్రకటనలను చూస్తే, దాదాపు 50/50 విదేశీ మోడ‌ల్స్‌ మొఖాలే క‌నిపించేవి. అన్ని వాయిస్‌ఓవర్‌లు బ్రిటిష్ గొంతులే వినిపించేవి అని స్టీవ్ బాబాకో అన్నారు. ఈ నిషేధం తాజాగా ప్రకటించిన‌ప్ప‌టికీ, ఇప్ప‌టికే, కంపెనీలు తమ ప్రకటనలలో ఏదైనా విదేశీ మోడల్‌ను ఉపయోగించుకోవడానికి ముందుగా 100,000-నైరా (సుమారు రూ.20 వేలు) రుసుము చెల్లించాలంటూ నైజీరియాలో ఆంక్షలు ఉన్నాయి.

Next Story

Most Viewed