ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలిసిన మోడీ

by Disha Web Desk 4 |
ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలిసిన మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా- ఉక్రెయిన్ వార్ మొదలైన తర్వాత తొలిసారి ప్రధాని మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలిశారు. కాగా తాజా భేటీ చర్చనీయాంశమైంది. శనివారం జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ -7 సమ్మిట్ లో భాగంగా మోడీ జెలెన్స్కీ ని కలిశారు. అయితే గతేడాది ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్-రష్యా వార్ అనంతరం వీరు తొలిసారిగా కలిశారు. అయితే ఇప్పటికే ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్స్కీ తో గతంలో పలు మార్లు ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో మోడీ ఉన్న ఫోటోలను పీఎంవో షేర్ చేసింది. ఈ భేటీలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దొవల్ ఉన్నారు. ఏడు దేశాలతో జరుగుతున్న జీ7 భేటీలో పాల్గొనాలని జపాన్ జెలెన్స్కీని ఆహ్వానించింది. గతంలో రష్యా అధ్యక్షుడితో మాట్లాడిన మోడీ ఇది యుద్ధ కాలం కాదని సూచించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉన్న విషయం తెలిసిందే. శాంతి చర్చలకు సహకరిస్తామని గతేడాది అక్బోబర్ 4న మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడికి సూచించారు. కాగా ప్రధాని మోడీ ఈ భేటీలో ప్రపంచం ముందున్న సవాళ్ల గురించి ప్రసంగించనున్నారు.

Next Story

Most Viewed