King Charles Coronation : బ్రిటన్ రాయల్ ప్రొటొకాల్స్ చాలా స్ట్రిక్ట్.. రాజు కూడా పాటించాల్సిందే

by Dishanational1 |
King Charles Coronation : బ్రిటన్ రాయల్ ప్రొటొకాల్స్ చాలా స్ట్రిక్ట్.. రాజు కూడా పాటించాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్ : గత ఏడాది సెప్టెంబర్ లో తన తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణంతో యునైటెడ్ కింగ్ డమ్ తో పాటు మరో 14 రాజ్యాలకు రాజుగా బాధ్యతలు స్వీకరించిన కింగ్ చార్లెస్- 3, క్వీన్ కన్సర్ట్ కెమిల్లాలకు వెస్ట్ మినిస్టర్ అబ్బేలో పట్టాభిషేకం జరిగింది. 1953లో క్వీన్ ఎలిజబెత్‌.. రాణిగా పట్టాభిషేకం అయిన తరవాత మళ్లీ ఇన్నాళ్లకు ఛార్లెస్ III రాజుగా ఎన్నికయ్యాడు. ఆయన 40వ మోనార్క్‌గా చరిత్ర సృష్టించాడు. సింహాసనంపై ఆయనకు కిరీటం పెట్టి రాజుగా ప్రకటించారు. ఆ సింహాసనం 1300-1301 మధ్య కాలంలో తయారు చేయించారు. అప్పటి నుంచి పట్టాభిషేక కార్యక్రమం అందులోనే నిర్వహిస్తున్నారు. శతాబ్దాలుగా స్కాట్‌లాండ్ కింగ్స్‌ అందరూ ఇదే సింహాసనంపై కూర్చుని బాధ్యతలు తీసుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో క్వీన్ ఎలిజబెత్ కన్నుమూశారు. తల్లి మరణం తరవాత కొడుకు ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్‌కి (74) వారసత్వంగా ఆ పదవి వచ్చింది.

అయితే ఇన్నేళ్లలో ప్రపంచం చాలా మారిపోయింది. కానీ బ్రిటన్ రాజ కుటంబం ప్రోటోకాల్‌లో మాత్రం ఎలాంటి మార్పులూ రాలేదు. పట్టాభిషేకం కూడా చాలా పకడ్బందీగా జరగింది. ఇక్కడికి వచ్చే వాళ్లే కాదు. కింగ్‌ ఛార్లెస్‌కి (King Charles Coronation) కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆయనా రూల్స్ పాటించాల్సిందే. రాయల్ ఫ్యామిలీ పెట్టిన నిబంధనలకు తలొగ్గాల్సిందే. మరి ఆ రూల్స్ ఏంటో చూద్దామా.

రాజుగారితో నో ఆటోగ్రాఫ్స్.. నో ఫొటోగ్రాఫ్స్

కింగ్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే అభిమానులు ఆయనను అభినందించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. కొందరు ఆటోగ్రాఫ్‌లు అడుగుతారు. మరి కొందరు ఫోటోలు తీసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ...కింగ్ ఛార్లెస్ మాత్రం వీటికి ఏ మాత్రం అంగీకరించకూడదు. ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైనా ఫోర్జరీ చేసే ప్రమాదముందన్న కారణంతో ఈ రూల్ ఫాలో (Royal Rules) అవుతారు. ఒకవేళ కింగ్‌ని ఆటోగ్రాఫ్ అడిగినా "సారీ" అని నవ్వుతూ చెప్పేస్తాడు. సెల్ఫీల విషయంలోనూ ఇంతే. అభిమానులతో సెల్ఫీలు తీసుకోకూడదు. కింగ్‌కి మాత్రమే కాదు. రాయల్ ఫ్యామిలీలోని అందరికీ ఈ రూల్ వర్తిస్తుంది.

వచ్చిన అన్ని గిఫ్ట్‌లూ తీసుకోవాల్సిందే..

ఈ వేడుకలో ఆయనకు వచ్చే ఏ గిఫ్ట్‌నైనా సరే కింగ్ తీసుకోవాల్సిందే. అయితే...ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఏమేం గిఫ్ట్‌లు ఇస్తున్నారనేది మాత్రం రాయల్ ఫ్యామిలీ మెంబర్స్‌ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. వాటి వల్ల ఏదైనా సమస్య తలెత్తుతుందా..? అన్నది క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ తరవాత ఎలాంటి వివాదాల్లోనూ చిక్కుకోకుండా ముందుగానే జాగ్రత్తపడతారు.

రాజకీయాలకు రాజు దూరం!

ఇంగ్లాండ్‌లో జరిగే ఎన్నికల్లో కింగ్‌ ఓటు వేయకూడదు. ఆయన ఏ పార్టీకి కూడా సపోర్ట్‌ ఇవ్వడానికి వీల్లేదు. అంతే కాదు. పబ్లిక్‌గా తన రాజకీయ అభిప్రాయాలనూ వెల్లడించకూడదు. ఆయన తటస్థ వ్యక్తిగా ఉండాలి.

ఫుడ్‌ సేఫ్టీ విషయంలో చాలా స్ట్రిక్ట్..

అపరిచిత వ్యక్తులు ఇచ్చే ఆహార పదార్థాలు రాజుగారు తీసుకోకూడదు. ఎవరైనా అందులో విషం కలిపి ఉంటారన్న అనుమానంతో ఈ ప్రోటోకాల్‌ తప్పనిసరిగా పాటించాలి. కొన్ని ఫుడ్ ఐటమ్స్‌ని తినడంపైనా ఆంక్షలు ఉంటాయి. డిన్నర్ చేసేటప్పుడు ముందుగా కుడివైపున ఉన్న గెస్ట్‌తోనే మాట్లాడాలి. ఆ తరవాత విజిటర్స్‌తో మాట్లాడాలి.

కింగ్‌కు డ్రెస్ కోడ్ తప్పనిసరి..

విదేశీ పర్యటనలు చేసినప్పుడు కింగ్ తన ఇష్టమొచ్చినట్టు డ్రెస్‌లు వేసుకుంటానంటే కుదరదు. కచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. దేశ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా స్పెషల్‌గా డిజైన్ చేసిన డ్రెస్‌లు మాత్రమే వేసుకోవాలి. ప్రయాణాలు చేసే సమయంలో బ్లాక్‌ డ్రెస్‌లు వేసుకోవాలనేది ప్రోటోకాల్. ఇక మరో స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే... పొరపాటున కూడా కింగ్ ఛార్లెస్ III తన కుమారులతో కలిసి ప్రయాణం చేయకూడదు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. యూకేలో రాజుగారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే కారు నడపవచ్చు. ఈ అవకాశం ఆయనకు మాత్రమే.

ఇవి కూడా చదవండి:

Coronavirus: కరోనాపై డబ్ల్యూహచ్‌వో గుడ్ న్యూస్.. ఇక మీదట కోవిడ్ ప్రపంచ విపత్తు కాదు..కానీ!

Next Story

Most Viewed