Coronavirus: కరోనాపై డబ్ల్యూహచ్‌వో గుడ్ న్యూస్.. ఇక మీదట కోవిడ్ ప్రపంచ విపత్తు కాదు..కానీ!

by Dishanational1 |
Coronavirus: కరోనాపై డబ్ల్యూహచ్‌వో గుడ్ న్యూస్.. ఇక మీదట కోవిడ్ ప్రపంచ విపత్తు కాదు..కానీ!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచాన్ని తీవ్ర స్థాయిలో భయపెట్టిన మహమ్మారి.. కరోనావైరస్. దీనినే కొవిడ్-19 అని కూడా పిలుస్తారు. కంటికి కనిపించని ఈ వైరస్ తో ఎన్నో దేశాలు తీవ్రంగా పోరాడాయి. అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయి. 2020 నుంచి కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. లక్షలాది మంది దీనికి బలైపోయారు. అయితే కొవిడ్‌-19 పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహచ్‌వో) ఒక కీలక ప్రకటన చేసింది.

కరోనా మహమ్మారి ఇకపై ప్రపంచ విపత్తు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రపంచ విపత్తుగా పరిగణించేంతటి స్థాయిలో కరోనా వైరస్ ప్రభావం లేదని.. మూడు సంవత్సరాల క్రితం కోవిడ్-19 కోసం ప్రకటించిన ఎమర్జెన్సీని ఇక నుంచి ఎత్తివేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్, టెడ్రోస్ అధనామ్ యూఎన్ ఆరోగ్య సంస్థ కోవిడ్ హెచ్చరిక స్థితిని డౌన్‌గ్రేడ్ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించగా, అతను దాని నిరంతర ముప్పు గురించి హెచ్చరిక కూడా చేశారు. కానీ ఈ వ్యాధి ఇప్పటికీ ప్రమాదకరమని తెలుపుతూ.. ప్రతి మూడు నిమిషాలకు ఒకరిని చంపుతుందని ఆయన చెప్పారు.

కోవిడ్ సంక్షోభంపై చర్చించిన WHO అత్యవసర కమిటీ ఇకపై.. కరోనాను హైఎమర్జెన్సీ స్థాయికి అర్హమైనది కాదని నిర్ణయించింది. COVID-19 మహమ్మారి దీర్ఘకాలిక నిర్వహణకు ఇది మారడానికి సమయం ఆసన్నమైందని నిపుణుల కమిటీ సూచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ తెలిపారు. అయితే మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని, ఇప్పటికీ అది ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగానే ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా బారిన పడి ప్రతివారం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

King Charles Coronation : బ్రిటన్ రాయల్ ప్రొటొకాల్స్ చాలా స్ట్రిక్ట్.. రాజు కూడా పాటించాల్సిందే

Next Story

Most Viewed