ఉక్రేనియన్ శరణార్థుల గురించి అడిగితే కమలా హారిస్ ఇలాంటి రెస్సాన్స్‌?! నెట్లో తిట్లే తిట్లు!!

by Disha Web Desk 20 |
ఉక్రేనియన్ శరణార్థుల గురించి అడిగితే కమలా హారిస్ ఇలాంటి రెస్సాన్స్‌?! నెట్లో తిట్లే తిట్లు!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః బాధ‌లో ఉన్నోళ్ల‌కి స‌హాయం చేస్తారా అని అడిగితే.. సాయం చేయ‌క‌పోగా, ప‌గ‌ల‌బ‌డి న‌వ్వితే ఎవ‌రికైనా ఎలా ఉంటుంది? స‌రిగ్గా, అగ్ర దేశం అమెరికా ఉపాధ్య‌క్షురాలి న‌వ్వుకు ఇలాంటి స్పంద‌నే వ‌చ్చింది. యుద్ధానికి ప్ర‌ధాన కార‌ణ‌మే అమెరికా న‌డిపించే నాటో కూట‌మి అని ప్ర‌పంచానికి తెలుసు. న‌మ్మి మోస‌పోయిన బాధిత దేశం ఉక్రెయిన్ ఇప్పుడు గ‌గ్గోలు పెడుతోంది. దీనిపైన మాట్లాడ‌టానికే ఉక్రెయిన్‌కు మొద‌టి నుంచి మోర‌ల్ స‌పోర్ట్‌గా ఉన్న పోలాండ్‌ను సంద‌ర్శించారు అమెరికా ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారీస్‌. గురువారం వార్సాలో పోలిష్ ప్రెసిడెంట్ ఆండ్రెజ్ డుడాతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో క‌మ‌లా హారీస్ పాల్గొన్నారు.

మీడియా స‌మావేశంలో భాగంగా ఉక్రెయిన్ శరణార్థుల భవితవ్యం గురించి ఓ జ‌ర్న‌లిస్ట్ అడిగిన ప్రశ్నకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నవ్వులు పూయించారు. ''ఉక్రేనియన్ శరణార్థులను యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటుందా..?'' అని క‌మ‌లా హారీస్‌ను అడిగి, వెంటనే పోలాండ్ ప్రెసిడెంట్ డుడాను ఉద్దేశించి, ''ఎక్కువ మంది శరణార్థులను అనుమ‌తించాల్సిందిగా మీరు యునైటెడ్ స్టేట్స్‌ను ప్రత్యేకంగా కోర‌తారా?" అని జ‌ర్న‌లిస్ట్ అడిగిన వెంట‌నే క‌మ‌లా హారీస్ ఇలా స్పందిస్తారు. సమాధానమివ్వడానికి ముందు, క‌మ‌లా హారిస్ పోలిష్ ప్రెసిడెంట్ వైపు చూడ‌టం, ఎవ‌రు మొద‌ట‌ స్పందించాలీ అనే సంధిగ్థ‌త నెల‌కొన‌డంతో ఇద్ద‌రూ న‌వ్వుతారు. త‌ర్వాత‌, క‌మలా హారీస్‌ "ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్డీడ్ (అవసరంలో ఆదుకున్న‌స్నేహితుడే నిజ‌మైన‌ స్నేహితుడు" అంటూ కొన్ని క్ష‌ణాలు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతారు.

వెంట‌నే డుడా ప్ర‌తిస్పందిస్తూ.. ఉక్రేనియన్ శరణార్థుల కోసం స‌హాయ‌ ప్రక్రియను వేగవంతం చేయమని పోలాండ్ క‌మ‌లా హారిస్‌ను కోరిందని ప్ర‌సంగం కొన‌సాగిస్తారు. త‌ర్వాత‌, క‌మ‌లా హారీస్ స్పందిస్తూ.. ఉక్రెయిన్ శరణార్థులు అధికంగా రావ‌డం వ‌ల్ల పోలాండ్‌పై భారం పడుతున్న అంశం ఇరువురు నేతలు చర్చించుకున్నామ‌ని చెబుతారు. కానీ, అమెరికా నిర్దిష్ట సంఖ్యలో ఉక్రెయిన్‌ శరణార్థులను తీసుకుంటుందా లేదా అనే దానిపై ఆమె సమాధానం ఇవ్వ‌లేదు.

ఇక‌, అంత కీల‌క‌మైన ప్ర‌శ్న‌కు ఇంతగా న‌వ్వినందుకు ప్ర‌శ్న అడిగిన జ‌ర్న‌లిస్టుకే కోపం క‌ట్ట‌లు తెచ్చుకుంది. "మేడం! నేను చాలా సీరియ‌స్ అంశాన్ని ప్ర‌స్తావించాను" అంటూ ఉపాధ్య‌క్షురాలికి చుర‌క అంటిస్తుంది. ఇక సోష‌ల్ మీడియాలో క‌మ‌లా హారీస్‌ను తీవ్రంగా విమ‌ర్శించారు నెటిజ‌న్లు. "ఇది నవ్వే విషయం కాదు. చాలా దారుణం.. మీరు న‌వ్వ‌డం సమంజ‌సం కాదు" అంటూ కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంటే, "ఇందులో నవ్వడానికి ఏముంది???" అంటూ ఇంకొంద‌రు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే, సీరియ‌స్ విష‌యాల‌కు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వ‌డం క‌మ‌లా హారీస్‌కు కొత్తేమీ కాదు! గతేడాది, ఆఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ దళాలను ఉపసంహరించుకోవడం గురించి విలేఖరులు అడిగినప్పుడు, ఆమె ముసిముసిగా నవ్వుతూ, "ఆగండి, పట్టుకోండి - అందరూ నెమ్మదిగా ఉండండి" అని జ‌ర్న‌లిస్టుల‌ను వారించ‌డం కూడా అప్ప‌ట్లో తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసింది.


Next Story

Most Viewed