Elon Musk : అతడి భార్యకు ఎలన్ మస్క్‌తో ఎఫైర్..!

by Shiva |
Elon Musk : అతడి భార్యకు ఎలన్ మస్క్‌తో ఎఫైర్..!
X

న్యూయార్క్‌ : అపర కుబేరుడు, ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. మస్క్‌తో అఫైర్‌ నడిపిందనే కారణంతోనే తన భార్య నికోల్‌ షన్‌హన్‌ కు గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గే బ్రిన్ విడాకులు ఇచ్చారంటూ ప్రఖ్యాత ‘పేజ్‌6’ మేగజైన్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది మే 26నే సెర్గే బ్రిన్, నికోల్‌ షన్‌హన్‌ కు విడాకులు మంజూరయ్యాయని, వారి నాలుగేళ్ల కూతురి సంరక్షణపైనా ఒప్పందం కుదిరిందని పేర్కొంది. వాస్తవానికి లైంగిక సంబంధం ఆరోపణలను మొదటి నుంచి ఎలన్ మస్క్‌, షెహనన్‌ బహిరంగంగానే ఖండిస్తూ వస్తున్నారు. పేజ్6 న్యూస్ స్టోరీ ప్రకారం.. 2021 నుంచే సెర్గే బ్రిన్, నికోల్‌ షన్‌హన్‌ విడివిడిగా ఉంటున్నారు. 2022లో తనకు విడాకులు కావాలంటూ బ్రిన్ అప్లై చేసుకున్నాడు. సరిదిద్దలేని మనస్పర్థలు తమ మధ్య ఉన్నాయంటూ కోర్టుకు బ్రిన్ తెలిపాడు. షన్‌హన్‌ విడాకులు తీసుకునేందుకు నిరాకరించినప్పటికీ సెర్గే బ్రిన్ విడాకుల కోసం పట్టుబట్టడంతో కోర్టు మంజూరు చేసింది.



Next Story