వార్తలు రాసిన విలేకర్లపై అధికార పార్టీ ఎంపీటీసీ భర్త దుర్భాషలాడుతూ... చంపుతా అంటూ బెదిరింపులు

by Kalyani |
వార్తలు రాసిన విలేకర్లపై అధికార పార్టీ ఎంపీటీసీ భర్త దుర్భాషలాడుతూ... చంపుతా అంటూ బెదిరింపులు
X

దిశ, కన్నాయిగూడెం :- దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై గళమెత్తే వర్కింగ్ జర్నలిస్టులపై దాడులు ఆగడం లేవు. ఎలాంటి లాభాపేక్ష ,స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకి వెళ్తున్నా పాత్రికేకులకు రాజకీయ నాయకులతో అవమానాలు ఏర్పడటం పరిపాటిగా మారిపోతుంది. వివరాల్లోకి వెళ్తే శనివారం రోజున సింగారం గ్రామం వద్ద ఇసుక క్వారీ వద్ద లారీలను స్థానికులు అడ్డుకోవడం జరుగుతుందని పలువురు గ్రామస్తులు స్థానిక కన్నాయిగూడెం మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు వార్త సేకరణ కోసం సంఘటన స్థలానికి వెళ్లడం జరిగింది. అప్పటికే పథకం ప్రకారం అదే ప్రదేశంలో ఉన్న ఏటూరు ఎంపీటీసీ భర్త చిట్యాల అరుణ్ కుమార్ కోపోద్రిక్తుడై పేపర్లో రాయలేని బూతు పురాణం విలేకర్లపై అందుకున్నాడు. దీంతో మీడియా ప్రతినిధులకు ఎంపీటీసీ భర్తకు సుమారు గంటపాటు ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం స్థానిక మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ …టీఎస్ఎండీసీ, మైనింగ్ నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు రాకుండానే ఏటూరు పట్టా ల్యాండ్స్, ప్రభుత్వ భూముల్లో భారీ ఎత్తున 10నుంచి 15మీటర్ల వరకు తవ్వకాలు చేస్తూ సంబంధిత అధికారులు వస్తున్నారని భారీ యంత్రాలను దొంగచాటున దాచిపెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగిందని తెలిపారు.

ఇసుక క్వారీ నిర్వాహకులకు స్థానిక ఎంపీటీసీ భర్తకు సత్సంబంధాలు ఉన్నాయని పలువురు బాహాటంగానే మాట్లాడుకోవడం జరుగుతుందని తెలిపారు. స్థానిక కన్నాయిగూడెం మండలం నుంచి గత రెండు మూడు రోజుల నుంచి ఇసుక క్వారీలపై వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలోనే మీడియా ప్రతినిధులపై దాడి చేసే ప్రయత్నం చేసారని పలువురు మీడియా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగారం గ్రామం వద్ద మీడియా ప్రతినిధులపై ఎంపీటీసీ భర్త దుర్భాషలాడటమే కాకుండా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం జరిగిందని మీడియా ప్రతినిధులు రాష్ట్ర స్థాయి యూనియన్ నాయకులకు సమాచారం అందించారు. తక్షణమే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్పందించి మీడియా ప్రతినిధుల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్నారు.


Next Story

Most Viewed