ఐపీఎల్ 2024: కీలక మ్యాచ్ లో టాస్ ఓడిన ఆర్సీబీ

by Mahesh |
ఐపీఎల్ 2024: కీలక మ్యాచ్ లో టాస్ ఓడిన ఆర్సీబీ
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు RCB vs CSK జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచుల్లో టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. కాగా ఈ మ్యాచులో ఆర్సీబీ గెలవడం చాలా ముఖ్యం అధికూడా నెట్ రన్ రేట్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆర్సీబీ టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ తీసుకునేది. అయితే ఈ మ్యాచ్ చెన్నై జట్టుకు కూడా అంతే కీలక అయినప్పటికీ ఒక వేల ఓడిపోయిన తక్కువ మార్జిన్ 18 పరుగుల లోపు తేడాతో ఓడిపోతే.. చెన్నై జట్టు ప్లే ఆఫ్ చేరుతుంది. ఇలాంటి కీలక మైన మ్యాచులో ఆర్సీబీ విజయం సాధిస్తుందా లేదా తెలియాలంటే చివరి వరకు వేచి చూడాల్సి ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డుప్లెసిస్(సి), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(w), కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (సి), డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ

Next Story

Most Viewed