డబ్బుల కోసం బ్యాంకు ఉద్యోగులను బంధించిన కస్టమర్.. (వీడియో)

by Disha Web Desk 6 |
డబ్బుల కోసం బ్యాంకు ఉద్యోగులను బంధించిన కస్టమర్.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: 2019లో లెబనాన్ ఆర్ధిక సంక్షోభం మొదలైంది. అప్పటి నుంచి స్థానిక బ్యాంకులు, డిపాజిటర్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా 42 ఏళ్ల బస్సామ్ అల్ షేక్ హుస్సేన్ అనే వ్యక్తి ఓ బ్యాంకులో సేవింగ్ అకౌంట్‌లో దాదాపై 2 లక్షల డాలర్ల వరకు జమ చేశాడు. అయితే ఇటీవల తన తండ్రికి ఆరోగ్య పరిస్థితి కారణంగా హాస్పిటల్‌లో ఉన్నాడు. దాంతో సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పడంతో హుస్సేన్ బ్యాంకుకు వెళ్లి తన డబ్బులు ఇవ్వాలని కోరాడు.

అధికారుల నుంచి ఏ సమాధానం రాకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయినా కానీ డబ్బులు ఇవ్వకపోవడంతో బ్యాంకు ఉద్యోగులను బంధించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హుస్సేన్‌కు సర్ది చెప్పి 35 వేల డాలర్లు బ్యాంకు నుంచి ఇప్పిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అతన్ని పోలీసులు ఆరెస్టు చేసి తీసుకెళ్లినట్టు సమాచారం.


Next Story

Most Viewed