మరోసారి భారీగా తగ్గిన చైనా జనాభా

by Dishanational2 |
మరోసారి భారీగా తగ్గిన చైనా జనాభా
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా జనాభా వరుసగా రెండో ఏడాదీ తగ్గుముఖం పట్టింది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్) ప్రకారం.. 2022లో చైనా జనాభా 1,418 బిలియన్లు కాగా, 2023లో 1,409 బిలియన్లకు తగ్గింది. అంటే ఒక్క ఏడాదిలోనే మొత్తం 27 లక్షల 5 వేల మంది తగ్గారు. కొవిడ్ 19 మరణాల వల్ల జనాభా తగ్గినట్టు ఎన్‌బీఎస్ పేర్కొంది. ఇక, జనానాల రేటు ఏడాది క్రితం 1000కి 6.77గా ఉండగా..అది 2023లో 6.39కి తగ్గింది. అలాగే 2023లో 90 లక్షల మంది జన్మించగా.. 2022లో 95 లక్షల మంది పుట్టారు. 2022 నుంచి 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి సంఖ్య 16.93 మిలియన్లకు పెరిగింది. చైనా జనాభాలో 31 రాష్ట్రాల ప్రజలు మాత్రమే లెక్కించబడ్డారు. ఇందులో హాంకాంగ్, మకావు, తైవాన్‌లు లేవు. అయితే జననాల రేటు తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ గతేడాది చైనాను అధిగమించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed