- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నమ్మి వస్తే యువతి గొంతు కోసి చంపిన బాయ్ ఫ్రెండ్
ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గోవాకు తీసుకొచ్చిన యువకుడు గొంతు కోసి హత్య చేశాడు

దిశ, నేషనల్ బ్యూరో: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గోవాకు తీసుకొచ్చిన యువకుడు గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన దక్షిణ గోవాలో చోటు చేసుకుంది. దక్షిణ గోవాలోని ఫాండా పోలీస్‌లు గర్ల్‌ఫ్రెండ్ హత్య చేసిన ఆరోపణలపై 22 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు. ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఈ జంట బెంగళూరులో నుంచి గోవాకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినట్టు సమాచారం. వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణ విషాదానికి దారితీసింది. అరెస్టైన నిందితుడు కర్ణాటకలోని ఉత్తర బెంగళూరుకు చెందిన సంజయ్ కెవిన్ ఎంగా గుర్తించారు. బాధితురాలు రోష్ని మోసెస్ ఎం (22) కూడా అదే ప్రాంతానికి చెందిన యువతిగా పోలీసులు తెలిపారు.
పెళ్లి ప్రతిపాదనే గొడవకు కారణమా..
బెంగళూరు నుంచి ఇటీవలే ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి గోవాకు వచ్చారు. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. రెండు రోజుల క్రితం సంజయ్ రోష్నిని హత్య చేసి ఆమె శవాన్ని అటవీ ప్రాంతంలో పారేశాడు. ఈ హత్య విషయం సోమవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో రోష్నీ మృతదేహాన్ని గుర్తించగా, ఆమె గొంతు కోసి ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. దక్షిణ గోవా పోలీస్ సూపరింటెండెంట్ తికం సింగ్ వర్మ సంఘటనా స్థలాన్ని సందర్శించి.. ప్రేమ సంబంధం, పెళ్లి ప్రతిపాదనతో వచ్చిన గొడవ కారణంగా జరిగిన హత్య అని పేర్కొన్నారు. మృతదేహాన్ని గుర్తించిన తర్వాత విచారణ ప్రారంభించినట్లు దర్యాప్తులో సంజయ్ హత్య చేసినట్లు ఆధారాలు లభించాయని పేర్కొన్నారు. 24 గంటల్లోనే బెంగళూరులో నిందితుడిని పట్టుకున్నామని దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు






