పాకిస్థాన్‌లో బాంబు దాడి: ఇద్దరు మృతి

by Dishanational2 |
పాకిస్థాన్‌లో బాంబు దాడి: ఇద్దరు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడిన పాకిస్థాన్‌లో బాంబు దాడి కలకలం రేపింది. పెషావర్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావీన్సులో ఆదివారం బాంబు దాడి జరిగింది. నాసిర్‌బాగ్‌ రోడ్‌లోని బోర్డు బజార్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దర మరణించగా..మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దుండగులు పార్క్ చేసిన బైకుపై బాంబును అమర్చి ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృత దేహాలను, గాయపడిన వ్యక్తిని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడుకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. దీనిపై ముఖ్యమంత్రి కేపీకే అలీ స్పందించారు. పేలుడును ఖండిస్తున్నట్టు తెలిపారు. దాడిపై నివేదిక సమర్పంచాలని అధికారులను ఆదేశించారు.

గత నెలలోనూ పాకిస్థాన్‌లో అనేక పేలుళ్లు జరిగాయి. ఓ పోలీసు వాహనం సమీపంలో జరిగిన పేలుడులో కనీసం ఐదుగురు పోలీసులు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. అలాగే బలూచిస్తాన్‌లో జరిగిన మరో ఘటనలో రెండు వరుస పేలుళ్లు సంభవించగా..సుమారు 26 మంది మృతి చెందారు. ప్రధానంగా, బలూచిస్తాన్, కరాచీ, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏడాది కాలంగా ఈ ప్రాంతంలో అనేక బాంబు దాడి ఘటనలు జరుగుతున్నాయి.


Next Story