నేను అధ్యక్షుడిగా గెలవకపోతే రక్తపాతమే: డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

by Dishanational2 |
నేను అధ్యక్షుడిగా గెలవకపోతే రక్తపాతమే: డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూఎస్ ప్రెసిడెంట్‌గా తనను ఎన్నుకోకపోతే అమెరికాలో రక్తపాతం తప్పదని హెచ్చరించారు. అయితే ఎవరికి ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఓహియోలో జరిగిన ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని తెలిపారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికవ్వకపోతే దేశంలో ప్రజాస్వామ్యం అంతమౌతుందని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ చెత్త ప్రెసిడెంట్ అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో నేను గెలవకపోతే, అమెరికాలో మరోసారి ఎన్నికలు జరుగుతాయని అనుకోవట్లేదని వెల్లడించారు. మెక్సికోలో కార్లను నిర్మించి, వాటిని అమెరికన్లకు విక్రయించాలనే చైనా ప్రణాళికలపై ఆయన మండిపడ్డారు. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆ కార్లను చైనా విక్రయించకుండా ఆంక్షలు విధిస్తానని తెలిపారు.

ట్రంప్‌కు మరోసారి ఓటమి ఖాయం: బైడెన్

ట్రంపు వ్యాఖ్యలు సోషల్ మీడియాతో వైరలయ్యాయి. దీంతో అధ్యక్షుడు బైడెన్ కార్యాలయం స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రాజకీయ బెదిరింపులను ట్రంప్ రెట్టించు చేస్తున్నాడని తెలిపింది.‘ట్రంప్ మరో జనవరి6 ఘటన కావాలని కోరుకుంటున్నారు. ఆయనకు మరోసారి అమెరికన్లు ఓటమి రుచి చూపించబోతున్నారు. ఎందుకంటే ట్రంపు వ్యాఖ్యలు తీవ్రవాదాన్ని, హింసను ప్రోత్సహించేలా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఆయనను తిస్కరిస్తారు’ అని తెలిపారు. కాగా, అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డెమోక్రాట్ల తరఫున బైడెన్ గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరూ అధ్యక్ష రేసులో ఉన్నారు.

Next Story

Most Viewed